Homeఆంధ్రప్రదేశ్‌Palnadu Police Scandal: రక్షణ ఇవ్వాల్సినోడే రాక్షసుడయ్యాడు.. ఏకాంతంగా ఉన్న జంటలపై పల్నాడు పోలీస్ పగ.....

Palnadu Police Scandal: రక్షణ ఇవ్వాల్సినోడే రాక్షసుడయ్యాడు.. ఏకాంతంగా ఉన్న జంటలపై పల్నాడు పోలీస్ పగ.. వైరల్ వీడియోలు!

Palnadu Police Scandal: పోలీస్ అంటే రక్ష.. పోలీస్ అంటే ధైర్యం.. పోలీస్ అంటే భరోసా. కానీ వీటికి అర్థాలనే చెరిపేశారు పల్నాడు జిల్లా పోలీస్ అధికారి ఒకరు. రక్షించాల్సింది పోయి తిరిగి ప్రజలను భక్షిస్తున్నారు. అశ్లీల వీడియోలతో రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న జంటలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కోరిక తీర్చమని కోరుతున్నారు. ఆపై బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఓ ఏ ఎస్ ఐ నిర్వాకం పోలీస్ శాఖ కి మాయని మచ్చగా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

* పల్నాడు జిల్లాలో..
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఓ ఎస్ ఐ పనిచేస్తున్నాడు. ఆయన నిర్వాకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా ఆ నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలను టార్గెట్ చేస్తాడు. ప్రేమికులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రదేశాలను ఎంచుకుంటాడు. ఎవరైనా జంటలు ఏకాంతంగా కనిపిస్తే వీడియోలు తీస్తాడు. పోలీస్ స్టేషన్ కు పదండి అంటూ భయపడతాడు. భారీగా డబ్బులు వసూలు చేస్తాడు. అంతటితో ఆగక్క తన కోరిక తీర్చాలంటూ యువతులను బెదిరిస్తుంటాడు. వీడియో కాల్స్ చేసి అసభ్యంగా శరీరాన్ని చూపి కోరిక తీర్చాలని వేధిస్తుంటాడు. అయితే ఇదంతా ఒక ఆటో డ్రైవర్ చేత చేయిస్తుంటాడు అన్నది స్థానికంగా ఉన్న టాక్.

* ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు సైతం..
ఇటీవల మాచర్లలో ఓ వ్యాపారి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో తీసి.. వారిని బెదిరించి పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశారు. ఒక్క ఏఎస్ఐ మాత్రమే కాదు అదే స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్స్ సైతం ఇదే ధోరణితో వెళ్తుంటారన్న టాక్ స్థానికంగా ఉంది. అమ్మాయిలతో పాటు మహిళలను లోబరుచుకోవడం.. బలవంతం చేయడం.. డబ్బులు వసూలు చేయడం సదరు పోలీసులకు అలవాటైన విద్యగా మారింది. అయితే జిల్లా ఎస్పీ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే పోలీస్ శాఖకు ఈ ఘటన మాయని మచ్చగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version