Palle Panduga 2.0: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె స్వరూపాలు మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ ఐదేళ్ల కాలం సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మౌలిక వసతుల కల్పన అనేది జరగని పనిగా మారింది. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన మౌలిక సౌకర్యాలపై దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద పంచాయితీరాజ్ తో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉంది. గతంలో పల్లెలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులతో పాటు ప్రత్యేక నిధులను మళ్లించేవారు. పవన్ దానికి ఒప్పుకోకుండా పల్లె పండుగ పేరిట రోడ్లతోపాటు కాలువల నిర్మాణం చేపట్టారు. దీంతో పల్లెలు ఒక స్వరూపం మార్చుకున్నాయి. ఇప్పుడు పల్లె పండుగ 2.0 ను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. రాజోలు నియోజకవర్గం శివకోడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే సంక్రాంతి నాటికి పల్లెల్లో మరిన్ని పనులు జరగనున్నాయి అన్నమాట.
* ముగ్గురిదీ ఒక్కో బాధ్యత..
కూటమి పెద్దల పనితీరు గమనిస్తే ఒక్కొక్కరిది ఒక్కో బాధ్యత. విదేశీ పెట్టుబడులతో పాటు పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకువచ్చే బాధ్యత మంత్రి నారా లోకేష్ తీసుకున్నారు. సీఎం చంద్రబాబు పాలనపై పూర్తి దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నారు. పవన్ విషయానికి వచ్చేసరికి పూర్తిగా గ్రామీణ అభివృద్ధి పైనే తన ఫోకస్ పెట్టారు. మరోవైపు రాజకీయంగా కూటమికి కష్టం వచ్చినప్పుడు ముందుకు వస్తున్నారు పవన్. కీలక ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. అయితే ఈ ముగ్గురు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారారు అనడం అతిశయోక్తి కాదు. అయితే పల్లె పండుగ 2.0 తో పల్లెల స్వరూపమే మారిపోతుందని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తోంది.
* గత ఏడాది జరిగిన తొలి పల్లె పండుగలో నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు. ఇప్పుడు దానికి రెట్టింపు రోడ్లు వేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13326 గ్రామపంచాయతీల పరిధిలో రూ.6787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
* పల్లె పండుగ 2.0 లో ఇప్పటికే 4000 కిలోమీటర్ల సిసి రహదారులు నిర్మించారు. పాడి రైతుల కోసం 22,500 మినీ గోకులాలు ఏర్పాటు చేశారు. కొత్తగా 8571 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మిస్తున్నారు. పాత రహదారుల స్థానంలో పునర్నిర్మాణం చేపడుతున్నారు. 58 కిలోమీటర్ల మ్యూజిక్ బ్రెయిన్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు.