https://oktelugu.com/

Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ లో నెంబర్ 2 ఆయనేనా?

గత కొద్ది రోజులుగా వైసీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు ఆ నేత. అధినేత తరువాత అన్నీ తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

Written By: , Updated On : February 22, 2025 / 11:57 AM IST
Botsa Satyanarayana

Botsa Satyanarayana

Follow us on

Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో నెంబర్ 2 ఎవరు? విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికీ అదే పరంపర కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో నెంబర్ 2 అంటూ గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి సైతం రాజీనామా చేశారు. ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే విజయసాయిరెడ్డి తర్వాత ఆ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పావులు కదిపిన నేత ఎవరు అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు.

* సైడ్ అయిపోయిన సజ్జల..
వాస్తవానికి నెంబర్ 2 అంటూ విజయ సాయి రెడ్డి ( Vijaya Sai Reddy )తర్వాత చాలామంది ఉండేవారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రముఖంగా వ్యవహరించేవారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో చాలా యాక్టివ్ గా పని చేసేవారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఒకానొక దశలో విజయసాయిరెడ్డిని సైడ్ చేసి నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం సజ్జల యాక్టివ్ తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యమిస్తున్న మునుపటిలా యాక్టివ్ గా లేరు. దీంతో నెంబర్ 2 స్థానం అనేది ఖాళీగా ఉండిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ ఉన్న ఆయన కుమారుడు మిధున్ రెడ్డి ఢిల్లీ వ్యవహారాలు చూస్తున్నారు. కేవలం తెర వెనుక వ్యూహాలను మాత్రమే పెద్దిరెడ్డి రచించగలరు.

* ఎంతో ప్రాధాన్యం ఇస్తున్న జగన్
అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో నెంబర్ 2 అంటే గుర్తుకొస్తున్నారు బొత్స సత్యనారాయణ. ఆయన మాజీ మంత్రి, ఆపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆపై విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. క్యాబినెట్ హోదాతో సమానమైన శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు. తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బొత్స సత్యనారాయణ తో సమకాలీకులైన నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వారు ఎవరు ముందుకు రావడం లేదు.

* అన్ని బొత్స ఆధ్వర్యంలోనే..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులతో పాటు కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) భద్రతపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. దీనిపై తాజాగా గవర్నర్కు ఫిర్యాదు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం. దానికి సారధ్యం వహించారు బొత్స సత్యనారాయణ. మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. విశాఖలో ప్రత్యేక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో పార్టీలో ఇప్పుడు నెంబర్ 2 పాత్రలో బొత్స సత్యనారాయణ ఉన్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సైతం బొత్సకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.