NTV Journalists Arrested: జర్నలిజం అంటే ఒక బాధ్యత. ఒకప్పుడు పాత్రికేయులకు ఆ స్థాయిలో గౌరవం ఉండేది అంటే దానికి ప్రధాన కారణం.. వారు తమ వృత్తిని సమాజ హితం కోసం చేసేవారు. ఒకప్పుడు రాజకీయ నాయకులకు మించి పాత్రికేయులకు గౌరవం లభించేది అంటే దానికి కారణం వారు కాపాడుకున్న విలువలు. అందువల్లే పాత్రికేయాన్ని సమాజానికి, ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని పిలుస్తుంటారు.
నేటి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. పాత్రికేయమనేది భజనపరమైన వ్యవస్థ లాగా రూపాంతరం చెందింది. ఎదుటి వారి మీద అడ్డగోలుగా వార్తలను కాకుండా గోబెల్స్ ప్రచారం చేయడం పెరిగిపోతుంది. అందువల్లే పాత్రికేయాన్ని నేటి కాలంలో ఎవరూ దేకడం లేదు. కనీసం విలువ కూడా ఇవ్వడం లేదు. మనదేశంలో గడచిన కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయానికి విలువ పూర్తిగా తగ్గిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ విలువ మరింత పాతాళంలోకి చేరుకుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి మీద ఎన్టీవీ అడ్డగోలుగా కథనాన్ని ప్రసారం చేసింది. ఒక ఐఏఎస్ అధికారి కి ఆయనకు లింకు పెట్టి ఇష్టానుసారంగా స్టోరీని ప్రజెంట్ చేసింది. వాస్తవానికి ఇటువంటి స్టోరీ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఎన్టీవీ యాజమాన్యం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఇప్పుడు ఏకంగా అరెస్టుల దాకా వెళ్ళిపోయింది.
తెలంగాణ సిసిఎస్ పోలీసులు ఎన్ టీవీ లో పనిచేసే పాత్రికేయులను అరెస్ట్ చేశారు. వారంతా కూడా విదేశాలకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సిపి సజ్జనార్ వెల్లడించారు. చట్టం తన పని తాను తీసుకుపోతుందని స్పష్టం చేశారు. ఒక మహిళ ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితంపై అడ్డగోలుగా కథనాన్ని ప్రసారం చేయడం పాత్రికేయం అనిపించుకుంటుందా అని.. సజ్జనార్ ప్రశ్నించారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇదే క్రమంలో ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, సీఈవో అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. సంస్థలో పనిచేసే పాత్రికేయులు జైలు పాలు అవుతుంటే.. మేనేజ్మెంట్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతవాసాన్ని కొనసాగించడం ఎంతవరకు సమంజసమని పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యతయుతమైన పదవులలో ఉండి.. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తులు న్యూస్ చానల్స్ ఎలా నడిపిస్తారని పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు.. తెలంగాణ పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్లు 75, 78, 79 కింద ఎన్ టీవీ లో పనిచేసే పాత్రికేయులు పై కేసులు నమోదు చేశారు. ఇవన్నీ కూడా అదుపుతప్పిన నోరు కు.. ఇష్టానుసారంగా రాసిన. పెన్నుకు, అడ్డగోలు ప్రసారాలకు సంకెళ్లు అని న్యూట్రల్ జర్నలిస్టులు చెబుతున్నారు. మరోవైపు చైర్మన్, సీఈవో ప్రస్తావన కూడా సజ్జనార్ విలేకరుల సమావేశంలో తీసుకువచ్చారు. ఈ ప్రకారం వారిని కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది.. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.