NTR Statue In Amaravati: అమరావతిలో( Amaravathi capital ) ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనిని కులాల మధ్య వివాదంగా మలిచే కుట్రలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక ప్రచారం. నీరుకొండలో విగ్రహం ఏర్పాటుకు 1750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. జనసేనను రెచ్చగొడుతోంది. కుల పరమైన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ప్రచారాన్ని నమ్మవద్దు అని కోరింది. అలా జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.
* ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఏకాభిప్రాయంతో అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభించారు. అయితే అప్పట్లోనే రాజధాని లో ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ వంటి మహనీయుల విగ్రహాలు పెట్టాలని భావించారు. అమరావతి నిర్మాణ వ్యూహంలోనే దానిని పొందుపరిచారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్వీర్యం అయింది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని హడావిడిగా ఏర్పాటు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమరావతి పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు కదలిక వచ్చింది. గతంలోనే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు నిర్ణయించారు. కానీ ఇప్పుడు దానిని రాజకీయ రగడ చేయాలనుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో కులం పేరుతో జనసేన ను రెచ్చగొడుతోంది.
* ప్రభుత్వం క్లారిటీ..
అయితే ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. 1750 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అనేది అవాస్తవం అని స్పష్టం చేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో.. పర్యాటక ప్రాజెక్టులో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతోంది. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని రూపొందిస్తామని చెప్పుకొస్తోంది. ప్రభుత్వ నిధులతో సంబంధం లేదని.. ప్రైవేటు సంస్థలతోనే నిర్మాణంతో పాటు నిర్వహణ ఉంటుందని చెబుతోంది. అయితే ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై దుష్ప్రచారం చేసింది. జనసేన సైతం ఈ ప్రచారంలో భాగమైంది. కానీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో ఇది వైసిపి ప్రచారంగా తేలిపోయింది.