Homeఆంధ్రప్రదేశ్‌New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్టేట్.. వెంటనే తెలుసుకోండి

New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్టేట్.. వెంటనే తెలుసుకోండి

New Ration Cards: ఏపీలో( Andhra Pradesh) కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియ కూడా జరుగుతోంది. లక్షలాదిమంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే దీనికి గడువులేదని.. రేషన్ కార్డుల దరఖాస్తు అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొన్ని రకాల మినహాయింపులు కూడా ఇచ్చారు. వివాహ రిజిస్ట్రేషన్ తో పాటు వివాహ శుభలేఖలు పొందుపరచాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించారు. దీంతో మరింతగా దరఖాస్తులు సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Also Read: చెవిరెడ్డి ఔట్.. ప్రకాశం బాధ్యతలు ఆయనకే!

* వాట్సాప్ సేవలు ప్రారంభం..
రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్( WhatsApp governance) రూపంలో రేషన్ కార్డుల సేవలు ప్రారంభం అయ్యాయి. 9552300009 నంబర్ కు హాయ్ అనే మెసేజ్ చేస్తే సేవలను ఎంచుకోవాలని ఆప్షన్ వస్తుంది. అటు తరువాత మీరు పౌర సేవలు, సివిల్ సప్లై సేవలపై క్లిక్ చేయాలి. ఇలా చేశాక దీపం స్థితి, రైస్ డ్రా, ఈ కేవైసీ, రైస్ కార్డుల సమర్పణ, ఆధార్ సీడింగ్, కార్డు విభజన వంటి ఎనిమిది సేవలు కనిపిస్తాయి. వీటిలో అన్ని వివరాలు నమోదు చేసి వాట్సాప్ ద్వారానే రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. అయితే రేషన్ కార్డులో మార్పులు చేసుకోవడం, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

* సాంకేతిక సమస్యలతో..
ప్రస్తుతం సచివాలయాల్లో కొత్త రైస్ కార్డులకు( rice cards ) దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ డౌన్ కావడంతో ఆన్లైన్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మనమిత్ర సేవలను తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అందుకే వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సమయం ఆదా అవుతుంది. నిమిషాల వ్యవధిలోనే ఈ వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఇకనుంచి పెళ్లి రిజిస్ట్రేషన్ అవసరం లేదని.. దరఖాస్తు ప్రక్రియ కూడా నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రకటన చేయడంతో దరఖాస్తుదారులు ఊరట పొందారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular