https://oktelugu.com/

New Liquor Policy: మద్యం షాపులకు టెండర్ వేయాలనుకుంటున్నారా.. మార్గదర్శకాలు ఇవే

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. మద్యం వ్యాపారం చేయాలనుకున్న వారికి అపూర్వ అవకాశం. నూతన మద్యం పాలసీలో భాగంగా.. ప్రైవేటు మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3736 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : September 30, 2024 / 09:20 AM IST

    New Liquor Policy

    Follow us on

    New Liquor Policy: ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రకటనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రభుత్వ దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. కొత్త షాపులు అందుబాటులోకి వచ్చేవరకు.. ప్రభుత్వ మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా నిలిచిపోయిన బ్రాండెడ్ మద్యాన్ని తిరిగి అందుబాటులోకి తేనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ రిటైల్ విధానంలో అమ్మకాలు సాగించనున్నారు. ఇందుకోసం లైసెన్స్ ఫీజులను సైతం ఖరారు చేశారు. ఈ నూతన విధానం రెండేళ్ల పాటు కొనసాగుతుంది. ఎక్కువగా రిటైలర్లను భాగస్వామ్యం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3736 దుకాణాలను ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో గీత కార్మికులకు 10% కేటాయించనున్నారు. 340 దుకాణాలు వారికి కేటాయించే అవకాశం ఉంది. తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఇదే హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు చేయడానికి డిసైడ్ అయ్యారు.

    * చీప్ లిక్కర్ కనిష్ట ధర రూ.99
    చీప్ లిక్కర్ క్వార్టర్ కనిష్ట ధర 99 రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణలో 140 ఉండగా, కర్ణాటకలో 80 రూపాయలు, తమిళనాడులో 90 రూపాయలు, ఒడిస్సాలో 90 రూపాయలు గా ఉన్నందున.. వాటి సగటును పరిగణలోకి తీసుకొని ఏపీలో వాటర్ 99 రూపాయలుగా నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం బ్రాండ్లు అమ్మకాలు చేసిన సంగతి తెలిసిందే. వాటన్నింటినీ తొలగించి.. వాటి స్థానంలో పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తేనున్నారు. అదే సమయంలో ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు దొరికే ఎలైట్ షాపులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. అక్కడికక్కడే బీరు రూపొందించే ఎలైట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా 12 ఏర్పాటుకు అనుమతించింది.

    * ప్రైవేటు దుకాణాలు రద్దు
    ప్రైవేట్ మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్స్ జారీ చేయనున్నారు. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ దుకాణాలను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. నోటిఫికేషన్ విడుదల అనంతరం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దరఖాస్తు ఫీజును రెండు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఆ మొత్తం తిరిగి ఇచ్చే అవకాశం లేదు. ఒకరు ఎన్ని దుకాణాలైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన వైన్ షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. పది వేలు జనాభా ఉన్నచోట 50 లక్షల రూపాయలు, పదివేల నుంచి 50 వేలు ఉన్నచోట 55 లక్షల రూపాయలు, 50 వేల నుంచి ఐదు లక్షల జనాభా ఉన్నచోట 65 లక్షల రూపాయలు, 5 లక్షలకు పైగా ఉన్నచోట 85 లక్షల రూపాయలను లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు.

    * 6 నుంచి అమ్మకాలు
    ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించి అక్టోబర్ 6 వరకు గడువు ఉంది. ఈ లోపల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే.. షాపులకు స్టాక్ చేర్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.