Pakistan(1)
Pakistan: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అఖండ భారత దేవం నుంచి పాకిస్తాన్ సామరస్యపూర్వకంగా విడిపోయింది. పూర్తి ఇస్లామిక్ దేశంగా అవతరించింది. మహ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పడింది. పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో భారత్‌లో ప్రభుత్వం ఏర్పడింది. అయితే విభజన సామరస్యంగా జరిగినా.. భూభాగాలు, సరిహద్దు విషయంలో ఇప్పటికీ దాయాది దేశాల పంచాయితీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా, అభివృద్ధి పరంగా వెనుకబడిన పాకిస్తాన్.. భారత అభివృద్ధిని ఓర్వలేకపోతోంది. దీంతో అల్లర్లు సృష్టించేందుకు ఆశాంతి రేకెత్తించేందుకు, ఆర్థికంగా దెబ్బతీసేందకు కవ్విపం చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రవాదులను అక్రమంగా భారత్‌లోకి పంపుతోంది. దీంతో నరేంద్ర మోదీ పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2016లో పెద్ద నోట్లు రద్దు చేశారు. దీంతో ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు పాకిస్తాన్‌ను అడుక్కుతినే స్థాయికి తీసుకువస్తానని మోదీ శపథం చేశారు. అన్నట్లుగానే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి తయారైంది. ఆర్థిక వనరులు లేకపోవడం, అధిక జనాభా, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, ఆర్థికమాంద్యం కారణంగా ఆ దేవంలో రోజు గడవడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే రుణాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు పాకిస్తానీలు. రుణం కోసం కూడా పాకిస్తాన్ నానా కష్టాలు పడుతోంది.
7 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కోసం..
తాజాగా పాకిస్తాన్ ఏడు బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెప్పిన షరతులకు తొలగ్గింది. పాలనా వ్యవయాలు తగ్గించుకునేందుకు దేశంలో దాదాపు 1..50 లక్షల ఉద్యోగాల్లో కోత పెట్టాలని నిర్ణయించింది. ఆరు మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలికి మరో రెండింటిని విలీనం చేయాలని భావిస్తోంది.
దివాలా అంచుకు చేరువై..
పాకిస్తాన్ దివాలాకు చేరువైనా ఐఎంఎఫ్ ద్వారా మూడు బిలియన్ డారల్ల రుణసాయంతో గండం నుంచి గట్టెక్కింది. ఇదే చివరి సారి అంటూ దీర్ఘకాలిక రుణం కోసం ఐఎంఎఫ్‌కు కొతకాలంగా మంతనాలు జరుపుతోంది. సహాయ ప్యాకేజీ విషయంలో ఎట్టకేలకు సెప్టెంబర్ 26న ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం, పన్ను–జీడీపీ నిష్పత్తి పెంచడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై పన్ను రాయితీలు తగ్గించడం వంటి చర్యలకు పాకిస్తాన్ హామీ ఇచ్చింది. దీంతో మొదటి విడతగా ఒక బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ విడుద చేసింది.
చివరిసారి అంటూ..
పాకిస్తాన్ ఇప్పటికే చాలాసార్లు అప్పులు చేసింది. ఈసారి ఇదే చివరిసారి అని ఐఎంఎఫ్‌ను ఆశ్రయించింది. జీ20 కూటమిలో చేరడానికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. దీంతో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఆరు మంత్రిత్వ శాఖలు తీసివేసింది. మరో రెండు మంత్రిత్వ శాఖలు విలీనం కానున్నాయి. ఈ నేపథ్యంలో 1.50 లక్షల ఉద్యోగాలు. తొలగిస్తామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔంగజేబు వెల్లడించారు. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 16 లక్షల నుంచి 32 లక్షలకు పెరిగిందనితెలిపారు.