High Speed Railway line : తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. రెండు రాష్ట్రాల మధ్య రవాణా భారం తగ్గనుంది. సెమీ హై స్పీడ్ రైలు క్యారిడార్ అలైన్మెంట్ ఖరారు అయింది. శంషాబాద్ నుంచి విశాఖ మధ్య సెమీ హై స్పీడ్ రైలు మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ కారిడార్ కానుంది. ఈ కారిడార్ పూర్తయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు నాలుగు గంటల లోపే రైలు చేరుకునే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఈ ప్రతిపాదన ఉంది. అందులో భాగంగా ఈ సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్ పై కీలక నిర్ణయం జరిగింది సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులోనే భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేట ల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మించనున్నారు.విశాఖ నుంచి సూర్యాపేట,నల్గొండ,కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మీదుగా కర్నూలు రైలు చేరుతుంది. దీనికి సంబంధించి సర్వే తుది దశలో ఉంది. ప్రాథమిక స్థాయిలో ఇంజనీరింగ్ ప్రతిపాదనలు, ట్రాఫిక్ అంశాలపై సమగ్ర సర్వే జరుగుతోంది. ఈ నివేదికను వచ్చేనెల రైల్వే బోర్డు కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉంది.
* భవిష్యత్తు అవసరాల దృష్ట్యా
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా భారాన్ని తగ్గించేందుకు ఈ తొలి సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ ఎంతగానో దోహద పడనుంది.ఈ మార్గంలో శంషాబాద్, రాజమండ్రి విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. ఈ క్యారిడార్ పూర్తయితే విశాఖ, శంషాబాద్ మధ్య రైలు ప్రయాణం కేవలం నాలుగు గంటలే.
* మరింత సులువు
ప్రస్తుతం విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాలంటే దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఒక్కోసారి 14 గంటలు కూడా అవుతుంది. ఇక వందే భారత్ రైలు ఎనిమిదిన్నర గంటల్లో చేరుతుంది. అయితే ఈ క్యారిడార్ పూర్తయితే మాత్రం నాలుగు గంటల్లోనే ఈ ప్రయాణం జరగనుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా రైల్వేస్టేషన్లో ఈ క్యారిడార్ తో అనుసంధానించనున్నారు. ప్రజలకు ప్రయాణ భారాన్ని తగ్గించమన్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: New high speed railway line from visakha to shamshabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com