AP Mega DSC Results: ఆంధ్రప్రదేశ్ లో( Andhra Pradesh) డీఎస్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. మెగా డీఎస్సీ కి సంబంధించి ఫలితాలను సోమవారం రాత్రి విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. 16,347 పోస్టుల భర్తీకి గాను డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ నుంచి జూలై వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల కోసం మూడు లక్షల 36 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు 92 మంది శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పుడు మెగా డీఎస్సీ ఫలితాలను వెల్లడించారు. అధికారిక వెబ్ సైట్ http://apdsc.apcfss.in/ లో ఉంచినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: క్రికెట్ లో సంచలనం.. ఐదు బంతుల్లోనే టార్గెట్ ఛేదించారు
* అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు..
అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ( Mega DSC ) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఫైల్ గా సంతకం చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఇతరత్రా అంశాలను పూర్తి చేసి.. జూన్ నుంచి జూలై వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. రెండు సెసర్లలో నిర్వహించిన పరీక్షలకు 92.90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ సందర్శించి.. ఫలితాలతో పాటు స్కోర్ కార్డులను పొందవచ్చు. టెట్ వివరాల మీద అభ్యంతరాలు ఉంటే హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి.. స్వయంగా టెట్ వివరాలు సరి చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అభ్యర్థులకు రేపటి వరకు ఈ అవకాశం ఉంటుంది.
* స్వల్ప వ్యవధిలోనే..
స్వల్ప వ్యవధిలోనే డీఎస్సీ నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ( state government)పూర్తి చేయడం విశేషం. 2025 ఏప్రిల్ 20న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం 6000 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చింది. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇవ్వగా.. అక్కడ కొద్ది రోజులకే ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది. అయితే ఆ 6000 పోస్టులకు మరో 10 వేల పోస్టులను జతచేస్తూ.. 16,347 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. మెగా డీఎస్సీ ని పూర్తిచేసి తుది ఫలితాలను వెల్లడించారు. వీలైనంత త్వరగా మెరిట్ లిస్టును ప్రకటించి నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.