MLA Kotamreddy Sridhar Reddy:
MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు. వైసీపీలో పదవీకాలం ఉండగానే నాయకత్వాన్ని విభేదించారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లాలో టిడిపి బలం పెరగడానికి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక కారణం. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు కోటంరెడ్డి. అధినేత జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. జగన్ పట్ల అత్యంత విధేయత ప్రదర్శించేవారు. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జగన్ నిర్లక్ష్యం చేశారు. మంత్రిగా ఛాన్స్ ఇవ్వలేదు. పార్టీలో సైతం ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో జగన్ చర్యలతో విసిగి వేశారి పోయిన కోటంరెడ్డి టిడిపి వైపు వెళ్లారు. అయితే వైసిపి నేతలు తనకు చుక్కలు చూపించారని.. కుటుంబ సభ్యులు సైతం ఇబ్బంది పడ్డారని తాజాగా వెల్లడించారు ఆయన. ఆ ఇబ్బందులను తలచుకొని కన్నీటి పర్యంతం అయ్యారు.
2014, 2019 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వైసిపి నాయకత్వంతో విభేదించి టిడిపిలో చేరారు కోటంరెడ్డి. ఆయన తరువాత ఆనం రామనారాయణ రెడ్డి, ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు టిడిపి గూటికి వచ్చారు. దీంతో టిడిపి ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. పదికి పది సీట్లు గెలిచింది. అయితే దీని వెనుక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఉంది. వైసీపీతో విభేదించి టిడిపిలో చేరిన ఆయన.. జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి తో కలిసి సమన్వయంతో పని చేశారు. చివరిలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరడానికి కూడా ఆయనే కారణం. అందుకే ఎన్నికలకు ముందు వైసిపి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసుకుంది.చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది.
కడపకు చెందిన బోరుగడ్డ అనిల్ అయితే ఏకంగా ఫోన్ చేసి శ్రీధర్ రెడ్డి ని హెచ్చరించారు. మరోసారి జగన్ పై విమర్శలు చేస్తే నెల్లూరు నుంచి కొట్టుకుంటూ పోతానని హెచ్చరించారు. జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్లు సైతం కోటంరెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ఒకానొక దశలో దాడి చేసినంత పనిచేశారు. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు కోటంరెడ్డి. అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తనకు ఎదురైన పరిణామాలను వివరించి కన్నీటి పర్యంతం అయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలోకి వచ్చిన తరువాత.. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జిగా సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు జగన్. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డిశ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. చివరకు కుటుంబ సభ్యులను విడిచిపెట్టలేదు. అర్ధరాత్రి వాట్సాప్ లకు లేనిపోని వీడియోలు పంపించేవారని.. భార్యతో పాటు పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే వారని.. చివరకు వాట్సాప్ బ్లాక్ చేసుకోవాల్సి వచ్చిందని కోటంరెడ్డి తాజాగా వెల్లడించారు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపామని కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. ఇప్పుడు ఆ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Nellore rural mla kotamreddy sridhar reddy was in tears