Nara Lokesh golden leg: మంత్రి నారా లోకేష్ పై జరిగిన వ్యతిరేక ప్రచారం.. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మరొకరిపై జరగలేదు. 2009లో తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) తెర వెనుక ఉండి సహకారం అందించారు నారా లోకేష్. అప్పట్లో నగదు బదిలీ పథకం ఆలోచన ఆయనదేనని ఒక ప్రచారం ఉంది. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చిన లోకేష్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చూసుకోవడం ప్రారంభించారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారు. అప్పటినుంచి టిడిపిలో లోకేష్ ప్రస్థానం ప్రారంభం అయింది. కానీ పార్టీ శ్రేణుల్లో ఎక్కడో ఒక అనుమానం. చంద్రబాబుల లోకేష్ వ్యూహకర్త కాగలరా? ఆయనలా మారగలరా? వారసత్వం అందుకోగలరా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు లోకేష్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. చంద్రబాబు వ్యతిరేకులంతా లోకేష్ కు బద్ధ శత్రువులుగా మారిపోయారు. లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తారన్న రోజు నుంచి నేటి వరకు ఆయనపై వ్యక్తిగత దాడి కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో లోకేష్ రాటుదేలిపోయారు. ముళ్లను పూలుగా మార్చుకొని ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ప్రతీది లోకేష్ కు అనుకూలంగా మారింది.
ఆతిథ్య వేదిక విశాఖ..
తాజాగా నారా లోకేష్( Nara Lokesh ) మరో రికార్డ్ కు చేరువయ్యారు. తనపై ఉన్న ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసుకున్నారు. తాను గోల్డెన్ లెగ్ అని నిరూపించుకున్నారు. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రతిభ కనబరిచి సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించారు భారత మహిళలు. ఈసారి మహిళ క్రికెట్ వరల్డ్ కప్ కు ఇండియా వేదికగా మారింది. టోర్నీ ప్రారంభ వేదికగా విశాఖ అయ్యింది. ప్రారంభ వేడుకలకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ వేడుకలను ఘనంగా జరిపారు. ఇప్పుడు వరల్డ్ కప్ భారత జట్టు కైవసం చేసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఏపీ వైపు చూసేలా చేశారు నారా లోకేష్.
కుటుంబ సమేతంగా హాజరు..
నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ కు( final match) కుటుంబ సమేతంగా హాజరయ్యారు నారా లోకేష్. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి వెళ్లి మ్యాచ్ తిలకించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కుమారుడితో పాటు కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో కూడా సమావేశం అయ్యారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి సలహాలు సూచనలు స్వీకరించారు. అయితే ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలిచేసరికి దేశం యావత్తు ఆనందంలో మునిగిపోయింది. ఈ క్రమంలో నారా లోకేష్ సైతం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యారు. మొన్న మధ్యన ఇండియన్ క్రికెట్ జట్టుకు చెందిన ఓ ప్రముఖ క్రికెటర్.. ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించారు. లోకేష్ అన్న ప్రోత్సాహం మరువలేనిది అని ట్విట్ చేశారు. ఇప్పుడు ఏకంగా మహిళా జట్టు ప్రపంచ విజేతగా నిలవడం.. ప్రారంభ మ్యాచ్ తో పాటు ఫైనల్ మ్యాచ్ లోకేష్ తిలకించడంతో ఆయనపై ఉన్న ముద్ర చెరిగిపోయింది.