Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖపట్నం వైపు వస్తున్నాయి. అయితే సంస్థల ఏర్పాటు.. ప్రాథమిక స్థాయి నుంచి ఉద్యోగ, ఉపాధి నిచ్చే కోర్సులను అందుబాటులో తేవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు లోకేష్. ఇప్పటికీ హైదరాబాదులో కోచింగ్ సంస్థల్లో శిక్షణ ఇచ్చి ఐటి ఉద్యోగాలకు పంపిస్తున్నారు. కానీ ఏపీలో బీటెక్ చదువుతున్న వారికి మాత్రం అంత త్వరగా ఉద్యోగాలు రావడం లేదు. తక్కువ చదువుతో హైదరాబాదులో శిక్షణ తీసుకొని ఉద్యోగాలు పొందుతున్న వారి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి ఉండాలని లోకేష్ భావిస్తున్నారు. అలా కోచింగ్ ఇచ్చే సంస్థలు విశాఖ తో పాటు విజయవాడలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఉద్యోగానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు లోకేష్.
* శిక్షణ సంస్థల్లో చేరిన తర్వాత..
సాధారణంగా ఇంజనీరింగ్( engineering) చదవాలంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఆపై రిలీవ్ అయిన వెంటనే ఉద్యోగాలు దొరకవు. ఏడాది పాటు అన్వేషణలో ఉండేవారు ఉంటారు. చివరకు హైదరాబాద్ అమీర్పేట ఇతరత్రా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల్లో చేరుతున్నారు. అక్కడ కోర్స్ పూర్తయిన వారికి ఐటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అయితే హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 70 మంది ఏపీ వాసులే. అక్కడ శిక్షణ సంస్థలు కూడా ఏపీకి చెందినవే అధికం. అయితే అటువంటి శిక్షణ సంస్థలను ఏపీకి తీసుకొచ్చి శిక్షణ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు లోకేష్. అదే సమయంలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగాలు కల్పించే శిక్షణను ఇవ్వడంతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
* భవిష్యత్తు ఆలోచనతో.. విశాఖకు( Visakhapatnam) ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు వస్తున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తుంది. దానికి అనుబంధంగా చాలా సంస్థలు విశాఖకు వస్తాయి. ప్రభుత్వం చెబుతున్నట్టు భవిష్యత్తులో లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి తరుణంలో భవిష్యత్తు ఆలోచన చేసి.. లక్షలాదిమంది ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఇతర పోస్ట్ గ్రాడ్యుషన్ పూర్తిచేసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో లోకేష్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మార్పులు చేర్పులు చేయాలని సూచిస్తున్నారు. సెంట్రల్ సిలబస్ తో పాటు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలకు ఎంపికయ్యలా శిక్షణ నివ్వాలని భావిస్తున్నారు. ఆపై హైదరాబాద్ మాదిరిగా శిక్షణ సంస్థలను విరివిగా ఏపీలో ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి అయితే నారా లోకేష్ ఆలోచన అద్భుతంగా ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. చూడాలి లోకేష్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో..?