Nara Lokesh anger: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh ) చాలా కూల్ గా ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. ఏదో ఒక పెద్ద ఘటన జరిగితేనే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చాలా హుందాగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారపక్షం ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టింది నారా లోకేష్ కి. కానీ ఎన్నడూ మాట తూలలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ఎప్పుడు సంయమనంతో ఉంటారు. చాలా ఓపికగా వ్యవహరిస్తారు. అటువంటి లోకేష్ సొంత పార్టీ శ్రేణులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడి నుంచి ఎమ్మెల్యేల వరకు ఏం చేస్తున్నారు అని నిలదీసినంత పని చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ప్రజా దర్బారు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించినందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఒకటి కాదు రెండు కాదు ఐదు వేలకు పైగా వినతులు వచ్చాయి. వాటిని స్వీకరించేందుకు సమయం లేక వచ్చే వారం స్వీకరిస్తానని చెప్పారు.
జాడలేని ప్రజాదర్బార్లు..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్లు నిర్వహించాలని టిడిపి హై కమాండ్ ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు కలెక్టరేట్లో గ్రీవెన్స్ విభాగం కొనసాగిస్తూనే… నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు ప్రజాదర్బార్లు నిర్వహించి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని సూచించింది. కానీ దానిని కొంతమంది ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతున్నారు. పైగా సమస్యకు పరిష్కార మార్గం చూపడం లేదు. దానిని సీరియస్ గా తీసుకోవడం లేదు. అదే సమయంలో మంగళగిరిలో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారులో.. వినతులు స్వీకరించిన వెంటనే పరిష్కార మార్గం చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన టిడిపి శ్రేణులు, సామాన్య జనాలు మంగళగిరి ప్రజా దర్బార్ కు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ ఆగ్రహానికి గురయ్యారు.
వివాదాలు ఎందుకు పరిష్కరించలేదు?
తెలుగుదేశం( Telugu Desam) పార్టీ పరంగా పిలుపునిస్తున్న కార్యక్రమాలు సీరియస్ గా చేయకపోవడాన్ని లోకేష్ తప్పుపడుతున్నారు. ఇటీవల విజయవాడ ఎంపీ కేసినేని నాని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య విభేదాలు పరిష్కరించే స్థాయిలో చర్యలు లేవని లోకేష్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సరిగ్గా డీల్ చేయలేకపోయారని ఆవేదనతో ఉన్నారు. ఆపై క్రమశిక్షణ కమిటీ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు కట్టు దాటుతున్నారని.. అటువంటి వారిని కట్టడి చేయడంలో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు క్రమశిక్షణ కమిటీ విఫలం అయింది అన్న అభిప్రాయంతో ఉన్నారు లోకేష్. అందుకే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.