https://oktelugu.com/

Nara Lokesh : వైఎస్ సామ్రాజ్యంలోకి లోకేష్…ఏం జరుగుతుందో ఏమో? ఉత్కంఠ

పులివెందులలో సైతం సత్తా చాటాలని భావిస్తున్నారు. అటు పులివెందుల నుంచి సైతం ఇద్దరు బలమైన నేతలు ఉండటంతో.. టీడీపీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో అక్కడ పాదయాత్ర పక్కాగా ఉండేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. 

Written By:
  • Dharma
  • , Updated On : May 24, 2023 / 11:15 AM IST
    Follow us on

    Nara Lokesh : కడప..ఈ జిల్లా పేరు చెబితేనే ఆటోమేటిక్ గా వైఎస్సార్ కుటుంబం గుర్తుకొస్తుంది. నాలుగున్నర దశాబ్దాలుగా ఆ జిల్లా  ఆ కుటుంబానికి పెట్టని కోట. కాంగ్రెసేతర ప్రభుత్వాలు వచ్చినా ఆ కుటుంబ ఆధిపత్యానికి గండికొట్టే వీలులేని విధంగా తమ స్థిరమైన పట్టును ఏర్పాటు చేసుకున్నారు. అటువంటిది ఆ జిల్లాలో ఇటీవల పరిణామాలు మారుతూ వస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల్లో ప్రతికూల ఫలితాలు, వివేకానందరెడ్డి హత్యకేసుతో వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయి. జిల్లాపై ఇన్నాళ్లు చేసిన ఆధిపత్యంపై సవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పట్టుబిగించేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి చెక్ చెప్పాలని చూస్తోంది. ఈ తరుణంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కడప జిల్లాలో అడుగుపెట్టింది.

    చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర అనంతపురం, కర్నూలులో పూర్తయ్యింది. ఇప్పుడు కడపలో అడుగుపెట్టింది. జిల్లాలో నెలరోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఇప్పటివరకూ ఒక్కో జిల్లాలో నెలరోజులకు పైగా సాగుతున్నయాత్ర కీలక నియోజకవర్గాలన్నింటినీ కవర్ చేస్తోంది.  కుప్పంలో ప్రారంభమైన యాత్రపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించినా అడ్డుకోలేకపోయారు. ఎన్నిరకాల అడ్డంకులు వచ్చినా అధిగమిస్తూ లోకేష్ యాత్ర చేయగలుగుతున్నారు. తనపై రూమర్లను పటాపంచలు చేస్తూ లోకేష్ సాగించిన యాత్ర అందరి అభిమానాన్ని అందుకుంటోంది.

    ముందుగా టీడీపీ వర్గాల్లో లోకేష్ జోష్ నింపారు. వారిలో తనపై ఉన్న అనుమానాలన్నింటినీ తొలగించడంలో యువనేత సక్సెస్ అయ్యారు. యువగళం పాదయాత్ర ప్రారంభ సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అస్సలు లోకేష్ పాదయాత్ర చేయడం ఏమిటని విపక్షాలు లైట్ తీసుకున్నాయి. దీంతో టీడీపీ శ్రేణులు సైతం ఆందోళన చెందాయి. కానీ అనుమానాలను, అవహేళనలను పటాపంచలు చేస్తూ లోకేష్ ముందడుగు వేయగలిగారు. అదిరిపోతున్న ఎండలు కూడా లోకేష్ సంకల్పాన్ని తగ్గించలేదు. ఆదివారాలు కూడా ఆగడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన పాదయాత్ర షెడ్యూల్ తీరిక లేకుండా ఉంటుంది.

    అయితే లోకేష్ యాత్ర రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఊపును తెచ్చిపెట్టాయి. అటు తరువాతే అటు ప్రభుత్వం, ఇటు వైసీపీ శ్రేణుల అభ్యంతరాలు, అలజడులు తగ్గాయి.  వైసీపీకి బలమున్న ప్రాంతంలో సైతం లోకేష్ సక్సెస్ ఫుల్ గా పాదయాత్ర చేయగలుగుతున్నారు. పులివెందులలో సైతం సత్తా చాటాలని భావిస్తున్నారు. అటు పులివెందుల నుంచి సైతం ఇద్దరు బలమైన నేతలు ఉండటంతో.. టీడీపీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో అక్కడ పాదయాత్ర పక్కాగా ఉండేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు.