Nara Lokesh : నారా లోకేష్( Nara Lokesh) మరో బాంబు పేల్చారు. పార్టీలో నయా ఫార్ములాను తెరపైకి తెచ్చారు. తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకునేందుకు సిద్ధపడ్డారు. వరుసగా మూడుసార్లు ఆ బాధ్యతలు నిర్వర్తించడంతో తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇది పార్టీ సీనియర్లపై ప్రభావం చూపుతోంది. వారు తమంతట తాము పదవులు వదులుకోవాలని సూచించినట్లు అయ్యింది. తెలుగుదేశం పార్టీలోని అన్ని విభాగాల్లో సీనియర్లు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో చాలామంది సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. వారి వారసులను తెరపైకి తెచ్చారు. అయితే ఇదే మంచి సమయం అని భావించి పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు చంద్రబాబు. దాదాపు అన్ని విభాగాల్లో, కార్యవర్గాల్లో మార్పు ఉండాలని భావిస్తున్నారు. సీనియర్లతోపాటు జూనియర్లకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ తన పదవిని వదులుకున్నట్లు ప్రకటించారు. దీంతో అంతటా ప్రాధాన్యత సంతరించుకుంది.
* ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశం
ఈరోజు టిడిపి పోలిట్ బ్యూరో ( TDP polit bureau ) సమావేశం జరగనుంది. మీలో పార్టీ మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానిపై ప్రధానంగా చర్చిస్తారు. మరోవైపు వరుసగా మూడుసార్లు ఒక పదవిలో ఉంటే.. దానిని వదులుకోవాల్సిందేనని సంకేతాలు ఇవ్వనున్నారు. దాదాపు పార్టీలోని అన్ని కార్యవర్గాలను రద్దుచేసి.. కొత్తగా ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్లకు కార్యవర్గాల్లో ప్రాతినిధ్యం పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కోటి సభ్యత్వాల నమోదు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు కార్యవర్గాలను బలోపేతం చేయడం ద్వారా.. పార్టీని మరింత పటిష్ట స్థితిలో పెట్టాలన్నది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది.
* వారందరినీ తొలగించే అవకాశం
పొలిట్ బ్యూరో లో(polit bureau)దాదాపు సీనియర్లు ఎక్కువగా ఉన్నారు. ఏడుపదులు దాటిన వారు ఉన్నారు. అయితే తాజాగా లోకేష్ ప్రకటన చూస్తుంటే వీరందరిపై వేటు తప్పదని తెలుస్తోంది. అయితే లోకేష్ ప్రకటన చూస్తుంటే బాబు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేసి అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే టిడిపి అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబు తప్పుకొని లోకేష్ కు అప్పగిస్తారని మరో ప్రచారం. అందులో భాగంగానే లోకేష్ తాజా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. కొద్ది సంవత్సరాల కిందట లోకేష్ ను జాతీయ కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు సైతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సైతం ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
* లోకేష్ టీంకు ప్రాధాన్యం
ప్రస్తుతం తెలుగుదేశం( Telugu Desam) పార్టీ అధికారంలో ఉంది. అందుకే పార్టీ పదవులకు సైతం విపరీతమైన పోటీ నెలకొంది. ఎక్కువ చోట్ల యువనాయకత్వం ఉంది. వారందరిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకునే అవకాశాలు సైతం ఉన్నాయి. మరోవైపు పొలిట్ బ్యూరోలోకి జూనియర్లను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో లోకేష్ టీం కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీలో పోలిట్ బ్యూరో అనేది అత్యున్నత కేంద్రం. దానికి నిర్ణయాధికారాలు ఎక్కువ. అటువంటి విభాగంలోకి యువనేతలను పంపించాలని ఎప్పటినుంచో భావిస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోలిట్ బ్యూరోలోకి జూనియర్లను పంపించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఎవరెవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.