Nara Lokesh: నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు. నిజం ఇంటి నుంచి చెప్పులేసుకుని బయలుదేరే ముందు అబద్ధం ఊరంతా ప్రచారం చేస్తుందంటారు. ఇప్పుడు టీటీడీ( Tirumala Tirupati Devasthanam) విషయంలో జరుగుతోంది అదే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పింక్ డైమండ్ పోయిందని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేశారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. తరువాత ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చిన దానిపై విచారణ లేకుండా పోయింది. కనీసం దాని ఊసు లేదు. దీంతో అది ఫేక్ అని నిర్ధారణ అయిపోయింది. అయితే తాజాగా టీటీడీ నిర్వహిస్తున్న గోశాలలో 100కు పైగా ఆవులు చనిపోయాయని వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. టిటిడితో పాటు ప్రభుత్వం స్పందించింది.
Also Read: పొన్నవోలు ఔట్.. తెరపైకి అంబటి!
గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) నిర్వహణ విషయంలో అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లడ్డు కల్తీ కి గురైందని వచ్చిన ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీసాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. అదే సమయంలో స్వామివారి ఉత్తర ద్వారా దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీలో అపశృతి జరిగింది. ఓ ఆరుగురు వరకు భక్తులు చనిపోయారు. తిరుమల చరిత్రలోనే అత్యంత విషాద ఘటనగా ఇది మిగిలింది. అయితే టీటీడీ వైఫల్యం పై అప్పట్లో వైసీపీ ఆరోపణలు చేసింది. అదే సమయంలో టిటిడితో పాటు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాయి.
* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు..
అయితే తాజాగా టీటీడీ నిర్వహిస్తున్న గోశాలను ( goshala) 100 ఆవులు చనిపోయాయని ప్రచారం జరిగింది దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు, టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పందించారు. టీటీడీ నిర్లక్ష్యం వల్లనే భూశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోతున్నాయని ఆరోపించారు. వాస్తవాలను బయటకు తీసుకురావాలని.. తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. గోశాల సరైన నిర్వహణ లేక గత మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని చెప్పుకొచ్చారు. తమ హయాంలో గోశాల నిర్వహణ బాగుండేదని.. కూటమి ప్రభుత్వంలోనే అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు కరుణాకర్ రెడ్డి. అప్పటినుంచి దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
* టీటీడీ స్పష్టమైన ప్రకటన..
అయితే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam) స్పందించింది. ఆవులు చనిపోయాయి అన్న వార్త ఫేక్ అని తేల్చింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత టిటిడి స్పందించింది. ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. చనిపోయిన ఆవులు తమ గోశాలకు చెందినవి కావు అంటూ కూడా స్పష్టతనిచ్చింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు కొంతమంది ఇలా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో తిరుమల గోశాలలో ఆవుల మృత్యువాత పడలేదని స్పష్టమైంది. అదంతా ఉత్త ప్రచారం అని తేలిపోయింది.
* నారా లోకేష్ స్పందన ఇది..
తాజాగా ఈ ఘటనపై స్పందించారు మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ). సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.’ టీటీడీ గోశాలలో ఆవుల మరణాల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధారమైన, దురుద్దేశ పూరిత ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. ఈ వాదనలో ఎటువంటి నిజం లేదు. టీటీడీ వాస్తవాలను స్పష్టం చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించడానికి, రెచ్చగొట్టడానికి ముందుకు తెచ్చిన ఈ తప్పుడు కథనాన్ని నమ్మవద్దని భక్తులను కోరుతున్నాం. రాజకీయ లాభం కోసం పవిత్ర సంస్థల గురించి అబద్ధాలు వ్యాప్తి చేయడం సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదు’ అని నారా లోకేష్ స్పష్టం చేశారు.