Gorantla Madhav: గోరంట్ల మాధవ్( gorantla Madhav).. హిందూపురం మాజీ ఎంపీ. ఐదేళ్లపాటు అదే పదవిలో కొనసాగారు. కానీ అంతకంటా ముందే ఆయన సీఐగా పోలీస్ శాఖలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. పోలీస్ శాఖలో పనిచేయడంతో ఆ శాఖపై అపారమైన గౌరవం ఉండాలి. కానీ ఆయనలో అది మచ్చుకైనా కనిపించలేదు. తాను పూర్వాశ్రమంలో పోలీసులని గుర్తించుకొని మరి క్రమశిక్షణ కట్టు దాటారు. రాజకీయాల కోసం తనకు గుర్తింపు ఇచ్చిన పోలీస్ శాఖను మచ్చ తెచ్చేలా ఆయన వ్యవహరించారు. పోలీస్ అధికారులపై వ్యక్తిగత కామెంట్స్ చేస్తూ.. తనను తాను తక్కువ చేసుకున్నారు గోరంట్ల మాధవ్. రాజకీయాల కోసం పోలీస్ శాఖ వదులుకున్నారు. అది ఆయన ఇష్టం. కానీ అదే పోలీస్ శాఖపై ఆయన విరుచుకుపడుతుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
Also Read: తిరుమల గోశాలలో ఘోరం.. ఖండించిన నారా లోకేష్.. నిజానిజాలివీ
* పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా..
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తెలుగుదేశం పార్టీ హై కమాండ్ స్పందించింది. చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రభుత్వం అరెస్టు కు ఆదేశించింది. ఆయనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళుతుండగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలిసి అడ్డగించారు. చేబ్రోలు కిరణ్ ను తనకు అప్పగించాలని కోరారు. పోలీస్ విధులకు అడ్డంపడ్డారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
* ప్రైవేటు కస్టడీకి ఇస్తారా
ఒక పోలీస్ అధికారిగా( police officer) పనిచేసిన గోరంట్ల మాధవ్ కు.. ఓ కేసు నిందితుడిని ప్రైవేట్ కస్టడీని ఎవరైనా కోరుతారా? పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తారా? కానీ గోరంట్ల మాధవ్ ఆ పని చేశారు. అది తప్పు అని తెలిసిన ఆ పని చేయడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అరెస్టు చేసే క్రమంలో తమాషాలు చేస్తున్నావా అంటూ చిందులు వేశారు. లేనిపోని మాటలతో విరుచుకుపడ్డారు. తాను ఐదేళ్లపాటు ఎంపీగా పదవి చేపట్టానని కూడా చెప్పుకొచ్చారు. మీరు అసలు పోలీసులేనా అంటూ వారిని అవమానించేలా మాట్లాడారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకరకాల విమర్శలకు కారణం అవుతున్నాయి.
