Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Praised by Sakshi Media: లోకేష్ ను ఆకాశానికి ఎత్తేసిన సాక్షి!

Nara Lokesh Praised by Sakshi Media: లోకేష్ ను ఆకాశానికి ఎత్తేసిన సాక్షి!

Nara Lokesh Praised by Sakshi Media: మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) రామా అంటే.. వైయస్సార్ కాంగ్రెస్ మీడియాకు బూతు పదంలా వినిపిస్తుంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ నుంచి ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో అదే తరహా కథనాలు రావడం సహజం. ఆయన ఏం తప్పు మాట్లాడతాడా? ఆయన మాటల్లో ఏం తప్పులు దొర్లుతాయా? అని ఎదురు చూసేది సాక్షి మీడియా. ఇక సోషల్ మీడియా సైన్యం గురించి చెప్పనవసరం లేదు. ఆయన కోసం నడిచే వైసీపీ సోషల్ మీడియా ప్రత్యేకంగా ఉంది. ఆయన పాదయాత్ర చేసే సమయంలో దానిని ప్రజలకు వ్యతిరేకంగా చూపించేందుకు 1000 మంది వరకు సోషల్ మీడియా కార్యకర్తలను నియమించుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటువంటిది ఇప్పుడు అదే నారా లోకేష్ ను అదే వైసిపి అనుకూల మీడియా, సోషల్ మీడియా అభినందనలు తెలుపుతుండడం విశేషం.

* మధ్యాహ్న భోజన పథకం పై
ఎన్టీఆర్ జిల్లాలో( NTR district ) ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పై ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ నాసిరకం భోజనం పెట్టడంతో విద్యార్థులు ఆ భోజనాన్ని చెత్త బుట్టలో పడేశారు. వరుసగా విద్యార్థులంతా అలా భోజనం చెత్తబుట్టలో పారబోస్తుండడం పై ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అది విపరీతంగా వైరల్ అయింది. దీనిపై విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ స్పందించారు. విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. సంబంధిత హెచ్ఎం ను సస్పెండ్ చేశారు. మధ్యాహ్నం వంట ఏజెన్సీని తప్పించారు. అంతటితో ఆగకుండా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఈ ఘటన జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే పాఠశాలలో జరిగిన తప్పిదం పై లోకేష్ స్పందించిన తీరు అభినందనలు అందుకుంటుంది. ముఖ్యంగా క్షమాపణలు కోరుకోవడం ఆకట్టుకుంటుంది.

* వ్యతిరేక డిబేట్లో
అయితే పాఠశాలలో మధ్యాహ్న భోజనం( Mid day meals ) బాగాలేదని విద్యార్థులు పారబోయడం.. సాక్షికి ఒక ప్రచార అస్త్రంగా మారింది. ఈ క్రమంలో దానిపై డిబేట్ కూడా పెట్టారు. ఓ నలుగురు అస్మదీయ జర్నలిస్టులను తెచ్చి విశ్లేషకుల స్థానంలో కూర్చోబెట్టడం అనేది ఆనవాయితీ. ఇంతలో డిబేట్లో పాల్గొన్న ఒక విశ్లేషకుడు లోకేష్ ను అభినందనలతో ముంచేత్తారు. లోకేష్ పరిణితిని అభినందించారు. అయితే ఏదో ఆయన నోటి నుంచి వ్యతిరేక మాట వస్తుందని భావించిన యాంకర్ తటపటాయించడం కనిపించింది. మొత్తానికైతే లోకేష్ కు సాక్షిలో ప్రశంసలు రావడం నిజంగా గొప్ప పరిణామమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version