TDP MLA Family In Nepal: నేపాల్ లో( Nepal) చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారు. రెండు రోజులుగా ఏపీ సచివాలయంలో ఉంటూ సహాయ చర్యలను పర్యవేక్షించారు నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వ సాయంతో దాదాపు 200 మందికి పైగా స్వస్థలాల కు రప్పించడంలో సక్సెస్ అయ్యారు. దీనిపై నారా లోకేష్ కు సర్వత్ర అభినందనలు అందుతున్నాయి. ఈ క్రమంలో షాకింగ్ విషయం ఒకటి బయటపడింది. కర్నూలు జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే భార్య, అతని కుటుంబ సభ్యులు నేపాల్ లో చిక్కుకుపోయినట్లు సమాచారం వచ్చింది. దీంతో మరోసారి రంగంలోకి దిగారు నారా లోకేష్. నేరుగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తక్షణ సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
* మానస సరోవర్ యాత్రకు..
నేపాల్ లో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అక్కడ భారత రాయబార కార్యాలయంతో అనుసంధానంగా పనిచేశారు మంత్రి నారా లోకేష్( Nara Lokesh). నేపాల్ లో చిక్కుకున్న వారిని ఇక్కడకు తెప్పించే ప్రయత్నం చేశారు. దాదాపు 200 మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భార్య సుజాతమ్మ, కూతురు నివేదిత తో సహా 83 మంది యాత్రికులు నేపాల్ లో చిక్కుకుపోయారు. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ నెల ఐదున మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో నేపాల్ గంజ్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ నుంచి కాట్మండు రావాల్సి ఉండగా.. హోటల్ గదులు ఖాళీ చేయలేదు. లగేజీ తో పాటు విలువైన సామాగ్రిని అక్కడే ఉంచారు. అయితే వీరు బస్సు చేస్తున్న హోటల్ పై ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ క్రమంలో యాత్రికుల డబ్బు సుమారు 50 లక్షల రూపాయలు కాలిపోయిందని సమాచారం. అయితే ఆ సమయంలో వీరు హోటల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం వీరంతా డిబేట్ పరిధిలో క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
* ప్రస్తుతం టిబెట్లో..
కోట్ల సుజాతమ్మ తో( Kotla Sujatamma) మంత్రి నారా లోకేష్ ఫోన్లో మాట్లాడారు. ఆమెతో పాటు తోటి యాత్రికులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో యాత్రికులు ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే వారంతా క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నేపాల్ లో 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో దాదాపు 144 మంది వచ్చారు. విశాఖలో 104 మంది, రేణిగుంటలో 40 మంది దిగారు. మరో 40 మంది రాయలసీమకు చెందినవారు ఉన్నారు. స్వస్థలాలకు చేరుకున్న వారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే నేపాల్ నుంచి అందర్నీ సురక్షితంగా తీసుకొచ్చామని ప్రభుత్వం భావిస్తుండగా.. టిడిపి ఎమ్మెల్యే కుటుంబం చిక్కుకుపోవడం షాక్ ఇచ్చింది. వారిని స్వస్థలాలకు రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.