Nara Lokesh Helps Soldier : మంత్రి నారా లోకేష్( Nara Lokesh) చాలా దూకుడుగా ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో చాలా వేగంగా స్పందిస్తున్నారు. మొన్న మధ్యన విదేశాల్లో ఇబ్బందులు పడే ఏపీ యువకులను కాపాడారు లోకేష్. ఇటువంటి సమస్యల పరిష్కారానికి గాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ఒక ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. అయితే మంత్రి లోకేష్ కు చెబితే సమస్య పరిష్కారం అవుతుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయనను కలిసి ఎక్కువమంది సహాయాన్ని అర్ధిస్తున్నారు. గతంలో మంగళగిరిలో జరిగే వినతుల విభాగానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వెళ్లేవారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా దేశ సరిహద్దులో కాపలా కాశి ఒక తెలుగు జవాన్ కు ఊహించని కష్టం వచ్చింది. సొంత భూమి కబ్జాకు గురైందని ఆవేదనతో వీడియో తీసి ఆయన పంపాడు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ స్పందించారు. 24 గంటల వ్యవధిలో సమస్యకు పరిష్కార మార్గం చూపారు.
Also Read : ముద్రగడ విషయంలో చంద్రబాబు యూ టర్న్!
* జవాన్ సెల్ఫీ వీడియో..
శ్రీ సత్య సాయి జిల్లా( Sri Sathya Sai district ) అమరాపురం మండలం కే శివరంలో నరసింహమూర్తి అనే బిఎస్ఎఫ్ జవాన్ ఉన్నాడు. తన భూమిని కబ్జా చేశారని ఆయన సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమి కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు కబ్జా చేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. పరిష్కార మార్గం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
* లోకేష్ ట్వీట్
ఏకంగా మంత్రి నారా లోకేష్ ఆదేశించడంతో అధికారులు త్వరితగతిన స్పందించారు. పోలీసుల సమక్షంలోనే ఆ భూమిని సర్వే చేశారు. హద్దులు నిర్ణయించి జవాన్ నరసింహమూర్తి ( BSF jawan Narasimha Murthy )భూ సమస్యను పరిష్కరించారు. తమ సమస్య పరిష్కరించినందుకు నరసింహమూర్తి కుటుంబ సభ్యులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ట్వీట్ చేశారు.’ ఆర్మీ జవాన్ భూ సమస్యను 24 గంటల్లోనే పరిష్కరించడం జరిగింది. శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం మండలం కే శివరంలో తన భార్య, తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని వైసీపీ అయామ్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేసిన నాగరాజు కబ్జా చేశారని.. న్యాయం చేయాలంటూ రాష్ట్రానికి చెందిన బిఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి జమ్మూ కాశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. భూ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను. దీంతో సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో సమస్యకు పరిష్కారం లభించింది’ అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు నారా లోకేష్. గతంలో చాలా సమస్యలకు మంత్రి లోకేష్ ఇదే మాదిరిగా పరిష్కారం చూపడంతో ఎక్కువమంది ఆయననే ఆశ్రయిస్తున్నారు.
ఆర్మీ జవాను భూ సమస్యను 24 గంటల్లోనే పరిష్కరించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్… pic.twitter.com/iUjC56a676
— Lokesh Nara (@naralokesh) June 3, 2025