Mudragada issue : ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈ ఏడాదిలో ఎన్నికల హామీలు అమలు చేయలేదని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం నిర్వహించాలని నిర్ణయించింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టనుంది. మరోవైపు ఓ పాత కేసుకు సంబంధించి కీలక అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల కిందట కాపు రిజర్వేషన్ ఉద్యమం హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. టిడిపి ప్రభుత్వ హయాంలో తునిలో రైలు దహనం కేసుకు సంబంధించి.. కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేస్తుందన్న వార్త నిన్న రోజంతా హల్చల్ చేసింది. అయితే తాజాగా దీనిపై ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అటువంటిదేమీ లేదని.. ప్రభుత్వం అటువంటి చర్యలకు దూరమని ప్రకటించింది. ఆ జీవోను సైతం వెనక్కి తీసుకుంది. దీంతో ఇది ప్రాధాన్యత అంశంగా మారింది.
* హింస వైపు ఉద్యమం..
2014లో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం అప్పట్లో పతాక స్థాయికి చేరింది. అందులో భాగంగా విధ్వంస ఘటనలకు దారితీసింది. తునిలో రైలు దహనం ఘటన కలకలం రేపింది. అప్పట్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను ఆపి నిరసన కారులు నిప్పు పెట్టారు. అయితే ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత విజయవాడ కోర్టు ముద్రగడ పద్మనాభం తో సహా ఇతర నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఉండడంతో దీనిపై ఎటువంటి అప్పీల్ కు వెళ్లలేదు. దీంతో ఆ కేసుల నుంచి ముద్రగడ పద్మనాభం తో పాటు కాపు ప్రతినిధులకు విముక్తి కలిగింది.
Also Read : అక్కడ ముద్రగడకు అంత సులువు కాదు!
* ఆ తీర్పును సవాల్ చేస్తూ..
అయితే ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం.. కూటమికి వ్యతిరేకంగా మారడంతో.. ఏడాది కిందట వచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తూ జీవో కూడా జారీచేసింది. అయితే ఈ నిర్ణయం పై విమర్శలు వచ్చాయి. అయితే ఇది అనవసరంగా కాపులను కెలకడం అవుతుందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయ అంశంగా మార్చుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ జీవోను వెనక్కి తీసుకుంది.
* వ్యతిరేకత వస్తుందని..
ప్రస్తుతం కాపులు( kapu community ) కూటమికి అండగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉండడంతో కాపుల్లో ఎక్కువ శాతం కూటమి వైద్య మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం తో పాటు కాపు ప్రతినిధుల కేసుకు సంబంధించి హైకోర్టుకు వెళితే అది అంతిమంగా నష్టం చేకూరుస్తుందని కూటమి సర్కారు ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్లేందుకు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అందుకు సంబంధించి మరో జీవో జారీచేసింది. హైకోర్టుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ జీవోలో స్పష్టం చేసింది. కేవలం కాపుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి కూటమి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.