Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: నారా లోకేష్ గొప్ప ఆలోచన

Nara Lokesh: నారా లోకేష్ గొప్ప ఆలోచన

Nara Lokesh: అధికారం అంటే కేవలం దర్పమే కాదు. బాధ్యతలు సైతం ఉంటాయి. వాటిని గుర్తించి నడుచుకోవాలి. అధికారంలో ఉన్నాం కదా.. ఎలా అయినా గడిపేయవచ్చు. అనుకోవడం మాత్రం సరికాదు. కింది స్థాయిలో పార్టీ శ్రేణులతో పాటు ఎమ్మెల్యేలతో సైతం సమన్వయం చేసుకోవాలి. వారితో మమేకం అయి పని చేయాలి. గతంలో జగన్( Y S Jagan Mohan Reddy ) హయాంలో ఎమ్మెల్యేలకు కనీసం కలిసేందుకు కూడా అవకాశం ఇచ్చేవారు కాదన్న విమర్శ ఉంది. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద అనుమతులు తీసుకోవాల్సి ఉండేది అన్న విమర్శ ఉండేది. అధినేతను కలవాలంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు చుక్కలు కనిపించేవి అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటున్నారు చంద్రబాబు. అపాయింట్మెంట్ కోరిన వెంటనే ఎమ్మెల్యేలను కలిసేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఎలాగూ లోకేష్ అందుబాటులో ఉంటున్నారు. కానీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వంలో సైతం కీలక మంత్రిత్వ శాఖ నిర్వర్తిస్తున్నారు. లోకేష్ కు సైతం ఇతర ఎమ్మెల్యేల కోసం సమయం కేటాయించడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు డిన్నర్ మీటింగ్స్ కు ప్రాధాన్యమిస్తున్నారు లోకేష్.

* రోజుకు ఏడుగురు చొప్పున..
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు( AP assembly budget sessions )) ప్రారంభమయ్యాయి. మార్చి 7 వరకు కొనసాగనున్నాయి. అయితే మధ్యలో సెలవులు పోయి.. 17 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 14న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే లోకేష్ ఈ సమయంలోనే పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో డిన్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఇటీవల పార్టీలో సీనియర్ నేతలు, వారి కుటుంబ సభ్యులతో డిన్నర్ మీటింగ్స్ నిర్వహించారు లోకేష్. వారి అనుభవాలను, సలహాలను సూచనలను స్వీకరించారు లోకేష్. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్న అన్ని రోజులు… ప్రతిరోజు పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్సీలు, ఏడుగురు ఎమ్మెల్యేలతో డిన్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. అందుకు వారి కుటుంబ సభ్యులను సైతం అనుమతించారు. నియోజకవర్గంలో పార్టీస్థితిగతులు, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు ఇదోరకం ప్రయత్నం అని తెలుస్తోంది.

* సమన్వయం కోసమే..
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం ( Telugu Desam)పార్టీ ఒంటరిగానే 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి 10 మంది వరకు ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఉన్నారు. వీరందరితో సమన్వయం చేసుకోవాలని చూస్తున్నారు లోకేష్. నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని, వారి కుటుంబ సభ్యుల్లో ఉండే పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం గా తెలుస్తోంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగత, కుటుంబ పరమైన వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై మదింపు జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై వారితో మమేకం కావాలని ఈ ప్రయత్నం చేస్తుండడం మాత్రం శుభపరిణామం. ఆహ్వానించదగ్గది కూడా.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular