Nara Lokesh: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ( Allagadda MLA bhuma Akhila Priya ) వ్యవహార శైలి తరచూ వివాదాస్పదం అవుతోంది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తోంది. అయితే భూమా అఖిలప్రియ స్ట్రైట్ గా వెళ్తారు. ముసుగులో గుద్దులాటలు ఉండవు. ఈ క్రమంలోనే ఆమె కుటుంబం వివాదాల్లోకి వస్తోంది. తరచూ వారి వ్యవహార శైలి వివాదంగా మారుతోంది. తాజాగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న అఖిల ప్రియ బదులు జగత్ విఖ్యాత్ రెడ్డి ఓ సమీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది. సాక్షాత్తు అధికార పార్టీ మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు సమీక్షకు హాజరు కాగా ఎమ్మెల్యేకు బదులు ఆమె తమ్ముడు హాజరు కావడం విమర్శలకు తావిచ్చింది. మీడియాలో కథనాలు రావడంతో టీడీపీ నాయకత్వం సైతం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
Also Read: పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్!
* ప్రత్యర్థులు ప్రచారం చేసినా
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ చాలా దూకుడుగా ఉంటారు. అయితే తరచూ ఆమె కుటుంబం పై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. అయితే రాజకీయాల్లో( politics) దూకుడు తనం, ముక్కు సూటి తనం ఉంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అఖిలప్రియను చూసి ఇట్టే చెప్పవచ్చు. ఒకానొక దశలో ఆమెకు ఎమ్మెల్యే టికెట్ రాదు అని కూడా ప్రత్యర్థులు ప్రచారం చేశారు. కానీ ఆమె టిక్కెట్ తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమెకు రాజకీయ ప్రత్యర్థులతో పాటు వ్యక్తిగత ప్రత్యర్థులు కూడా ఉన్నారు. అందుకే ఆమెపై ఎక్కువగా వ్యతిరేక ప్రచారం జరుగుతూ ఉంటుంది.
* ఆమె దూకుడు మైనస్
అయితే అఖిల ప్రియా చుట్టూ జరుగుతున్న వివాదాలపై టిడిపి( Telugu Desam Party) హై కమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అఖిల ప్రియ పార్టీ పరంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు. కానీ ఆమె దూకుడు తనం మైనస్ గా మారుతోంది. తాజాగా ఆమె బదులు సోదరుడు అత్యున్నత సమీక్షలకు హాజరు కావడం.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు తావిచ్చింది. దీంతో మంత్రి నారా లోకేష్ నేరుగా రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.
* రంగంలోకి లోకేష్ సన్నిహితుడు
అయితే నేరుగా లోకేష్( Nara Lokesh) ఈ విషయంలో కలుగ చేసుకుంటే వివాదం మరింత పెద్దది అవుతుందని.. మీడియాకు ప్రధాన కారణంగా మారిపోతుందని భయపడి లోకేష్ తన అత్యంత సన్నిహితుడైన ఓ నేతకు ఈ పని అప్పగించినట్లు సమాచారం. సదరు నేత రంగంలోకి దిగి నేరుగా ఎమ్మెల్యే అఖిలప్రియ సోదరుడికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మీరెలా పాల్గొంటారని.. ఇకనుంచి అటువంటి పనులు చేయవద్దని.. లోకేష్ తనమాటుగా చెప్పారు అంటూ తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అఖిలప్రియ సోదరుడు నొచ్చుకున్నట్లు సమాచారం. అయితే ఎవరు ఎన్ని రకాల ప్రచారం చేసినా.. అఖిల ప్రియ నాయకత్వం పై లోకేష్ కు మంచి అభిప్రాయం ఉందని ఆమె అనుచరులు చెబుతున్నారు.