Nara Lokesh about Hindi: దక్షిణాది రాష్ట్రాలపై హిందీని( Hindi language) బలంగా రుద్దుతున్నారని కేంద్ర ప్రభుత్వం పై ఒక విమర్శ ఉంది. తమిళనాడుతో పాటు కర్ణాటకలో దీనిపై పెద్ద ఉద్యమమే నడుస్తోంది. అక్కడ ప్రాంతీయ, భాషా భావజాలం అధికం. ముఖ్యంగా తమిళనాడులో అయితే బిజెపి చర్యలను అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తుంటారు. అందుకే ఆ పార్టీ తమిళనాడులో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోతోంది. మిత్రులతో కలిసి మాత్రమే ముందడుగు వేయగలుగుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇప్పుడు బిజెపికి బలమైన మిత్రులు ఏపీలో ఉన్నారు. దీంతో వారి ద్వారా తమ విధానాలను అమలు చేసే ప్రయత్నంలో ఉంది బిజెపి. హిందుత్వ నినాదంతో పాటు హిందీ భాష పై ఇటీవల పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో మంత్రి నారా లోకేష్ కూడా చేరారు. ఆయన తాజాగా హిందీ భాషకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. దీంతో సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ప్రస్తుతం మంత్రి నారా లోకేష్( Nara Lokesh) విపరీతంగా ట్రోలింగ్ అవుతున్నారు. జాతీయ భాష హిందీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే కొనసాగుతోంది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యానాలు చేశారు. హిందీ భాష పెద్దమ్మ అయితే.. తెలుగు అమ్మ లాంటిదంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. దీంతో ఆయనపై సైతం తమిళ పార్టీలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ అయితే అమ్ముడుపోయారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. తమిళ రాజకీయ పార్టీల నేతలు సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు.
Also Read: Pawan Kalyan as AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?! జనసైనికుల ఫుల్ హ్యాపీ
అడ్డంగా దొరికిపోయిన లోకేష్..
అయితే ఇప్పుడు హిందీ భాష విషయంలో నారా లోకేష్ సైతం అడ్డంగా దొరికిపోయారు. కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందంటూ పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిందీ మన జాతీయ భాష ( national language)అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నారా లోకేష్. దీంతో లోకేష్ కు జాతీయ భాష అంశంపై అవగాహన లేదని ఎక్కువ మంది విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం హిందీకి అధికార భాష హోదా మాత్రమే ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అవగాహన లేకుండా మాట్లాడిన నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో లోకేష్ విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు.
బిజెపి ప్రాపకం కోసమే..
బిజెపి ప్రాపకం కోసమే పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan) పాటు లోకేష్ పోటీపడి మరి ఆరాటపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం సహకరించాల్సి ఉంది. మరోవైపు పవన్తో పాటు లోకేష్ రాజకీయంగా నిలదుక్కుకోవాలన్న బిజెపి అవసరం ఉంది. అదే సమయంలో బిజెపి ఈ ఇద్దరి నేతలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే వీరు బిజెపి తరఫున వాయిస్ వినిపిస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అనవసరంగా హిందీ భాష విషయంలో తల దూర్చి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.