https://oktelugu.com/

Nara Family : ట్రోల్ ఆఫ్ ది డే:‘నారా’ వారి తెలుగు.. మళ్లీ పేలాయి సెటైర్లు

తెలుగుదేశం పార్టీకి పెద్ద కుటుంబమైన నారా వారి ఫ్యామిలీ తెలుగును కూనీ చేసిన వీడియోను ఇందులో చూసి నవ్వుకోండి..

Written By:
  • NARESH
  • , Updated On : August 30, 2023 / 09:21 PM IST
    Follow us on

    Nara Family : వారిది తెలుగుదేశం పార్టీ.. కానీ ఆ పార్టీని నడిపించే నేతలకు తెలుగు రాదు. తేటతెలుగును కూనీ చేయడానికే ఈ పెద్దలు పుట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఇదే బ్యాచ్. కనీసం తెలుగులో పలకడం కూడా రాదు వీళ్లు మనల్ని పాలిస్తారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

    నారా చంద్రబాబు ఇటీవల ‘బైపీసీతో ఇంజినీరింగ్’ అన్నప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. ఇక మన తెలుగు తేజం నారా లోకేష్ భాష ప్రావీణ్యత గురించి రోజూ చెప్పుకుంటున్నారు.  అంతటి ఘనాపాఠీని కన్న చంద్రబాబు కూడా పెద్ద భాష ప్రావీణ్యుడేం కాదు.

    ఇప్పుడు లోకేష్  భాష ప్రావీణ్యం తల్లి భువనేశ్వరి నుంచే సంక్రమించిందని అందరికీ అర్థమయ్యేలా ఒక వీడియో వైరల్ అవుతోంది. లోకేష్ బాబుకు తెలుగు రాదు అని.. ఆయనకు ఆయన తల్లి భువనేశ్వరి నుంచే ఆ అది సంక్రమించిందని అర్థమవుతోంది. ఇటీవల భువనేశ్వరి ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణలో విలేకరులతో మాట్లాడుతూ ‘ఆరోగ్యమే మహాదానం’ అంటూ ఠంగ్ స్లిప్ అయ్యింది. ఆరోగ్యమే మహాభాగ్యం అనబోయి మన లోకేష్ లాగానే తడబడ్డారు.. ఎన్టీఆర్ కూతురు భాష ప్రావీణ్యత చూసి అందరూ కామెంట్స్ చేస్తున్నారు.. కనీస తెలుగు కూడా రాదా అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

    ఇక నారా బ్రాహ్మణికి కూడా తెలుగు రాదు.. ‘చీరలు, పదార్థాలు ఎలా నేశారో’ అంటూ ఆమె కూడా తెలుగును కూనీ చేసిన వీడియో వైరల్ అయ్యింది..

    తెలుగుదేశం పార్టీకి పెద్ద కుటుంబమైన నారా వారి ఫ్యామిలీ తెలుగును కూనీ చేసిన వీడియోను ఇందులో చూసి నవ్వుకోండి..