Homeఆంధ్రప్రదేశ్‌Nandyal Missing Girl: తుని చిన్నారి తరహాలోనే ఏపీలో మరో బాలిక మిస్సింగ్.. చివరికి ట్విస్ట్

Nandyal Missing Girl: తుని చిన్నారి తరహాలోనే ఏపీలో మరో బాలిక మిస్సింగ్.. చివరికి ట్విస్ట్

Nandyal Missing Girl: కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంతవరకు వీడలేదు. చిన్నారి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు తీయించింది. నంద్యాల శివారు ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు వందల మంది పోలీసులు. మొత్తం జల్లెడ పట్టేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి బయటకు వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా.. వెతుకులాట ప్రారంభించేసరికి అసలు విషయం తెలిసింది.

* డయల్ 100కు ఫిర్యాదు..
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారి బయటకు వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత తల్లి కుమార్తె కనిపించిన విషయాన్ని గుర్తించింది. అన్నిచోట్ల వెతికింది. జాడ తెలియక పోవడంతో ఆదివారం రాత్రి 9 గంటలకు డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించింది. తుని ఘటన నేపథ్యంలో నంద్యాల ఎస్పీ సునీల్ సోరాన్ అప్రమత్తం అయ్యారు. రాత్రంతా 200 మంది పోలీసులు గాలించారు పాప ఆచూకీ కోసం. డ్రోన్ కెమెరాలు, పోలీస్ జాగిలాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చిన్నారి వీధుల్లో తిరుగుతున్న సిసి ఫుటేజీ కనిపించింది. అయినా సరే జాడ తెలియలేదు.

* జొన్న చేనులో నిద్రపోతూ..
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువ జాము వరకు పోలీసులు జల్లెడ పట్టారు. అయితే ఇంటి సమీపంలోని ఓ జొన్న చేనులో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. జొన్న చేనులో చిన్నారి నిద్రపోతూ కనిపించడంతో.. పోలీస్ బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాపను తల్లి చెంతకు చేర్చాయి. ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే పాపను పోలీసులు గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుని చిన్నారి జ్ఞానేశ్వరి కి సంబంధించి నెలలు గడుస్తున్న ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో నంద్యాల ఘటన జరగడంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా షాక్ కు గురైంది. చిన్నారి ఆచూకీ వెనువెంటనే దొరకడంతో ఉపశమనం పొందింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version