Nagababu: మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu ) విషయంలో రకరకాల ప్రచారం నడుస్తోంది. మంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు టాక్ నడిచింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తారని కూడా ప్రచారం మొదలైంది. అయితే ఆయన విషయంలో రోజుకో రకం ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో స్వయంగా నాగబాబు స్పందించారు. తన విషయంలో జరుగుతున్న ప్రచారం పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇకనుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు. పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానన్నారు. గత కొంతకాలంగా జనసేన లో యాక్టివ్ తగ్గించారు నాగబాబు. ఆయన స్థానంలో రామ్ తాళ్లూరి వచ్చారు. దీంతో నాగబాబును పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారని ప్రచారం మొదలుపెట్టారు. కానీ ఆరోగ్యపరమైన సమస్యల కారణంగానే నాగబాబు కాస్త యాక్టివ్ తగ్గించారని తెలుస్తోంది. అయితే నాగబాబు విషయంలో ప్రత్యర్థి సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారం జరుపుతోంది.
ఉత్తరాంధ్ర పై ఫోకస్..
ఉత్తరాంధ్ర( North Andhra ) పై ఫుల్ ఫోకస్ పెట్టారు నాగబాబు. తరచూ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు తరచూ వెళ్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసేందుకేనని ప్రచారం మొదలుపెట్టారు. అయితే శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎంపీగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. మంచి పట్టున్న నాయకుడు కూడా. అయితే కూటమిలో గందరగోళం సృష్టించేందుకు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని భావించారు నాగబాబు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆయన దృష్టికి వచ్చింది సమస్య. అయితే తాను ఎక్కడికి వెళ్లినా ఇదే తరహా ప్రచారం చేస్తారని అక్కడికక్కడే క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో అసలు తాను పోటీ చేయనని.. ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం లేదని నాగబాబు తేల్చేశారు.
* ఆ ప్రచారానికి చెక్..
వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో నే నాగబాబు పోటీ చేయాల్సి ఉంది. అనకాపల్లి( Anakapalli ) పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఆ సీటు బిజెపికి కేటాయించారు. అక్కడ సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే అప్పుడే నాగబాబు ఆ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. కూటమి పార్టీల సమన్వయంతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలతో ఉండడంతోనే ఆయన జనసేనపై పూర్తి దృష్టి పెట్టలేకపోయారు. అందుకే తెర వెనుక పనులను రామ్ తాళ్లూరికి అప్పగించారు పవన్ కళ్యాణ్. అయితే జనసేన కార్యకర్తల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు నాగబాబు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతంలో పోటీ చేస్తారని ప్రచారం మొదలు పెడుతోంది వ్యతిరేక సోషల్ మీడియా. దానికి చెప్పేందుకు అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు నాగబాబు. అయితే ఆయన ప్రకటన చూస్తుంటే మాత్రం ఇకనుంచి నామినేటెడ్ పోస్టులతో మాత్రమే నెట్టుకొస్తారన్నమాట.