Nagababu : జనసేన పార్టీ(Janasena Party) 12 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పిఠాపురం లో ‘విజయకేతనం’ అనే భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా జనాలు వచ్చారు. ఎంత మంది వచ్చారు అనేది ప్రస్తుతానికి తెలియదు కానీ, సభ స్థలం నిండే స్థాయిలో అయితే బాగానే వచ్చారు. సభ హృద్యంగా సాగుతున్న తరుణంలో కొణిదెల నాగబాబు(Konidela Nagababu) మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు కూటమి నేతల మధ్య చిచ్చు రగిలించేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పిఠాపురం లో గెలవడానికి జనసేన పార్టీ నాయకులూ ఎంతలా అయితే కష్టపడ్డారో, పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కూడా అంతే కష్టపడ్డాడు. నిటారు ఎండల్లో ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రతీ ఇంటికి తిరిగాడు.
Also Read : జనసేన ‘జయకేతనం’.. ప్రత్యేక ఏర్పాట్లు ఇవే!
కేవలం వర్మ ఒక్కటే కాదు, వర్మ కుటుంబ సభ్యులు కూడా బాగా తిరిగారు. అయితే నాగ బాబు నోటికి అదుపు ఉండదు అని జనసేన పార్టీ అభిమానులు సైతం అంటూ ఉంటారు. నేడు ఆవిర్భావ సభలో అదే జరిగింది. ఆయన వర్మ పై సెటైర్లు వేస్తూ ‘పిఠాపురం(Pithapuram) లో జనసేన పార్టీ గెలవడానికి కేవలం రెండే రెండు ప్రధాన కారణాలు. ఒకటి మా అధినేత పవన్ కళ్యాణ్ కాగా, మరొకటి పిఠాపురం ఓటర్లు. ఇవి రెండు కాకుండా, కేవలం మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అని కొంతమంది అనుకుంటే మాత్రం, వాళ్ళ ఖర్మ కే వదిలేస్తున్నాం’ అంటూ నాగ బాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రత్యేకంగా ఆయన ‘వర్మ’, ‘ఖర్మ’ అని అర్థం వచ్చేలా మాట్లాడడం ఇక్కడ కొసమెరుపు. మిత్ర ధర్మం లో ఉంటూ ఇలా మాట్లాడడం ఎంత వరకు సబబు అని టీడీపీ పార్టీ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్నికలు జరిగిన రోజు కానీ, కౌంటింగ్ జరిగిన రోజు కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం కి రాలేదు కానీ, వర్మ మాత్రం అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అలాంటి వ్యక్తిపై విశ్వాసం లేకుండా మాటలు మాట్లాడడం సరికాదు. MLC పదవి ఇవ్వకుండా దూరం పెట్టడమే కాకుండా, ఇలాంటి మాటలు కూడా అనుభవించాలా అంటూ వర్మ అనుచరులు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో వర్మ ట్విట్టర్ ఖాతా నుండి పవన్ కళ్యాణ్ గెలవడానికి తానే కారణం అంటూ ఒక వీడియో ని అప్లోడ్ చేసాడు. ఆ తర్వాత ఆ వీడియో నేను వేయలేదు, ఏజెన్సీ వాళ్ళు వేశారు అని చెప్పుకొచ్చాడు వర్మ. బహుశా నాగబాబు కౌంటర్ ఇచ్చింది అందుకేనేమో అంటూ జనసేన పార్టీ అభిమానులు అనుకుంటున్నారు.
Also Read : జనసేన ప్లీనరీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఊహించని చేరికలు!
పిఠాపురం టీడీపీ నేత వర్మపై నాగబాబు షాకింగ్ కామెంట్స్..
పిఠాపురంలో పవన్ గెలుపుకు జనసైనికులు, ఓటర్లే కారణం
పవన్ కళ్యాణ్ విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ
– నాగబాబు pic.twitter.com/T649E0eBru
— BIG TV Breaking News (@bigtvtelugu) March 14, 2025