Balineni Srinivas Reddy
JanaSena Formation Day : అధికారం లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఆవిర్భావ సభ, జనసేన పార్టీ(Janasena Party) 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు పిఠాపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు అన్ని రాష్ట్రాల నుండి అభిమానులు అసంఖ్యాకంగా హాజరై విజయవంతం చేసారు. అయితే కూటమి నేతల మధ్య అస్సమ్మతి రేపే విధంగా కొణిదెల నాగబాబు(Konidela Nagababu) చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పిఠాపురం లో ఉన్నటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై నాగబాబు విసిరిన సెటైర్లు చూస్తే ఎవరికైనా కోపం రాక తప్పదు. జనసేన పార్టీ అభిమానులు కూడా నాగబాబు ని నోరు అదుపులో పెట్టుకోమని కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు ప్రసంగం తర్వాత సోషల్ మీడియా లో పెద్ద చర్చలకు దారి తీసిన ప్రసంగం ఎవరిదైనా ఉందా అంటే అది బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivasulu Reddy) ది అని చెప్పొచ్చు.
Also Read : జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ పిఠాపురం వర్మపై నాగబాబు సెటైర్లు..మండిపడుతున్న టీడీపీ అభిమానులు!
మాజీ సీఎం జగన్, ఆయన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడైన బాలినేని రీసెంట్ గానే జనసేన పార్టీ లో చేరాడు. ఇది వరకు ఆయన వైసీపీ పార్టీ పై ఘాటైన విమర్శలు చేయలేదు కానీ ఆవిర్భావ సభలో మాత్రం చాలా ఘాటైన విమర్శలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘నాకు వైఎస్ఆర్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం’ అని అంటాడు. అప్పుడు సభకు వచ్చిన అభిమానులు వాళ్ళ పేర్లు తీయొద్దు అంటూ పెద్ద ఎత్తున అరవడం మొదలు పెట్టగా, నేను చెప్పేది పూర్తి వినండి అంటూ ప్రారంభించాడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ఆయన మాట్లాడుతూ ‘వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం కారణంగా ఆయన తదనంతరం నేను వైసీపీ పార్టీ లో చేరి జగన్ కి అండగా నిలబడ్డాను. ఎన్నో కష్ట సమయాల్లో అతనికి తోడు ఉన్నాను’.
‘కానీ అతను మాత్రం నాకు ఎంతో అన్యాయం చేసాడు. నా ఆస్తులు సగం, నా వియ్యంకుడి ఆస్తిలో సగం కాజేసాడు. ఇలా మాట్లాడినందుకు నాపై రేపు వాళ్ళు ఎన్నో విమర్శలు చేయొచ్చు. నేను వాటిని ఎదురుకోవడానికి రెడీ. నేను వైసీపీ పార్టీ లో ఉన్నప్పుడే, పవన్ కళ్యాణ్ గారు నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఆరోజే నేను జనసేన పార్టీ లోకి వచ్చి ఉండుంటే బాగుండేది(ఎమోషనల్ అవుతూ). కానీ ఆ పార్టీ లోనే కొనసాగి పెద్ద పొరపాటు చేశాను. ఆరోజే నేను జనసేన లో చేరుంటే ఈరోజు నేను వేరే స్థాయిలో ఉండేవాడిని. కానీ నాకు పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రాణం పోయేవరకు జనసేన పార్టీ తోనే ఉంటాను. నాకు పదవులు ఏమి వద్దు సార్, మీతో సినిమాని నిర్మించే అవకాశం ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారిని కోరాను. ఆయన సినిమా చేస్తానని నాకు మాట ఇచ్చారు. అది చాలు నాకు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
Also Read :జనసేన ప్లీనరీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఊహించని చేరికలు!
Ysr peru ethithey manollu asalu Mataaa matladanivattle
Dad : Vallu villu chepthey vinaru Pawan Kalyan cheyi yethithey aguhtharu antaa
Cults Gurinchi manchi Clarity undhi @PawanKalyan #JanaSenaJayaKethanam #JanaSena12thFormationDay pic.twitter.com/65HPbASOVd
— తేజ నాయుడు™.. (@TEJA_NAIDU1) March 14, 2025
నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడు ఆస్తిలో సగం జగన్ మోహన్ రెడ్డి కాజేసాడు
– బాలినేని#JanaSena12thFormationDay pic.twitter.com/T2aTXqKHIg
— M9 NEWS (@M9News_) March 14, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Balineni srinivas reddy took ysrs name at jana sena formation meeting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com