Nagababu: శాసనమండలిలో బలమైన వాయిస్ వినిపించారు ఎమ్మెల్సీ నాగబాబు( MLC Nagababu). కొద్ది నెలల కిందట ఎమ్మెల్సీ అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు. ఇవే తొలి సమావేశాలు కావడంతో అందరి దృష్టి మెగా బ్రదర్ నాగబాబు పై పడింది. ఆయన ఏ అంశంపై మాట్లాడుతారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగింది. దానిని తెరదించుతూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసులు పరిష్కరించాలని శాసనమండలిలో కోరారు. తొలి ప్రసంగం తోనే ఆకట్టుకున్నారు. మున్ముందు తన పాత్రను చాటి చెప్పారు. అయితే సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ గా మిగిలిపోయారు. సోదరుడు చిరంజీవి, తమ్ముడు పవన్ మాదిరిగా ఒక ఇమేజ్ క్రియేట్ చేయలేకపోయారు. ఇప్పుడు పొలిటికల్ గా కూడా తమ్ముడు పవన్ ద్వారా ఒక మెట్టు ఎక్కారు. దానిని ఎలా పదిలం చేసుకుంటారో చూడాలి.
* సినిమాల్లో అలానే..
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవిది( megastar Chiranjeevi) ప్రత్యేక ట్రాక్ రికార్డ్. చిన్న నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. మెగాస్టార్ గా ఆయన ఎదిగిన తీరు ఒక అద్భుతం. అటువంటి చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు నాగబాబు. 1986లో రాక్షసుడు సినిమా ద్వారా యాక్టర్ గా మారారు. అయితే ఇప్పటివరకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోయారు. అన్న చాటు తమ్ముడిగా ఉండిపోయారు. అయితే కుమారుడు వరుణ్ తేజ్, కుమార్తె నిహారికలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వారు బాగానే రాణిస్తున్నారు. కానీ వారిపై మెగా ముద్ర ఉంది.
* మండలి లో ప్రసంగం..
పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan ) ఏర్పాటు చేసిన జనసేనలో క్రియాశీలక పాత్ర నాగబాబుది. 2019 ఎన్నికల్లోనే నాగబాబు జనసేన తరఫున పోటీ చేశారు. నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ పై నాగబాబు విపరీత వ్యాఖ్యలు చేసేవారు. టిడిపి అనేసరికి ఒక రకమైన భిన్నాభిప్రాయం ఆయనది. ఈ తరుణంలో 2024 ఎన్నికల్లో టిడిపి తో పొత్తు పెట్టుకుని జనసేన శత శాతం విజయం సాధించింది. పొత్తులో భాగంగా నాగబాబుకి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది. త్వరలో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా తెలుస్తోంది. అయితే సినిమాల్లో చిరంజీవి తమ్ముడిగా.. రాజకీయాల్లో పవన్ అన్నగా ప్రవేశించిన నాగబాబు తనకంటూ ఒక ముద్ర చాటుకోవాలని చూస్తున్నారు. నిన్న శాసనమండలిలో ఆయన ప్రసంగం చూస్తే అలానే ఉంది. సినిమాల్లో మెగా బ్రదర్ గా మిగిలిపోయిన నాగబాబు.. రాజకీయాల్లో ఆ ముద్ర చెరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి అది ఎంతవరకు సక్సెస్ కాగలరో?