Nagababu: తమ్ముడు పవన్ ప్రమాణం.. అన్న నాగబాబు ఏమోషనల్ వీడియో వైరల్

పవన్ కళ్యాణ్ విషయంలో స్పందించేందుకు ఎప్పుడు ముందుంటారు నాగబాబు. మెగా కుటుంబం నుంచి పవన్ కు అండగా నిలిచింది ఆయనే. గత ఎన్నికల్లో జనసేన తరఫున నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు.

Written By: Dharma, Updated On : June 21, 2024 5:19 pm

Nagababu

Follow us on

Nagababu: ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి మంత్రి అయ్యారు పవన్. ఏకంగా డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్నారు. ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు జనసైనికులు. మెగా కుటుంబ సభ్యులకు కూడా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషన్ అయ్యారు. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీ నుంచి పవన్ ప్రమాణాన్ని వీక్షించారు. ఆ వీడియోను స్వయంగా ఆయనే ట్విట్ చేశారు. పవన్ ప్రమాణాన్ని గ్యాలరీలో నుంచి వీక్షిస్తున్న దృశ్యాన్ని జతచేస్తూ నాగబాబు చేసిన ట్విట్ వైరల్ గా మారింది.’ పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’ అంటూ మొదలుపెట్టారు నాగబాబు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తోడబుట్టినవాడిగా, ఒక సామాన్య జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంలో నిండిపోయింది అంటూ కామెంట్స్ చేశారు నాగబాబు.

పవన్ కళ్యాణ్ విషయంలో స్పందించేందుకు ఎప్పుడు ముందుంటారు నాగబాబు. మెగా కుటుంబం నుంచి పవన్ కు అండగా నిలిచింది ఆయనే. గత ఎన్నికల్లో జనసేన తరఫున నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు. అయినా సరే పవన్ వెంట నడుస్తూ గత ఐదేళ్లుగా జనసేన పార్టీ విస్తరణకు తనవంతు సాయం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయనని.. పార్టీ సమన్వయ బాధ్యతలు చూస్తానని నాగబాబు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ విజయంలో కీలక భాగస్వామ్యం అయ్యారు. సోదరుడు పవన్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేశారు. నాగబాబు తో పాటు ఆయన భార్య, కుమారుడు వరుణ్ తేజ్ సైతం పిఠాపురంలో విస్తృత ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ కు 70 వేల మెజారిటీ దక్కడం లో వారి పాత్ర కూడా ఉంది. పవన్ తో పాటు జనసేన విజయాన్ని వారు ఆస్వాదిస్తున్నారు.సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎమ్మెల్యేగా పవన్ ప్రమాణస్వీకారాన్ని స్వయంగా చూసిన నాగబాబు ఎమోషనల్ అయ్యారు. వీడియోను జత చేసి ఆ అపురూప క్షణాల గురించి చెప్పుకొచ్చారు.

‘ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి.. పవన్ అను నేను అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకు ఇదే మొదటిసారి. ఐ ఫీల్ వెరీ త్రిల్. మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖ నిజాయితీతో, నిష్పక్షపాతంగా, అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను’ అంటూ నాగబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం నాగబాబు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.