UPS Pention Scheme : జగన్ ను ఫాలో అవుతున్న మోడీ.. బాబు ఏం చేస్తాడో మరీ

ఏపీ సీఎం చంద్రబాబును డిఫెన్స్ లో పడేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని జై కొడుతూ.. కేంద్రం తాజాగా పెన్షన్ స్కీమ్ ను ప్రకటించింది. దీని విషయంలో ఎలా ముందుకెళ్లాలో చంద్రబాబుకు తెలియడం లేదు.

Written By: Dharma, Updated On : August 26, 2024 3:10 pm

UPS Pension Shceme

Follow us on

UPS Pention Scheme : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యునైటెడ్ పెన్షన్స్ స్కీంను ప్రకటించింది.దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ప్రధాని మోదీ అధ్యక్షతన ఇటీవల క్యాబినెట్ సమావేశమైన సంగతి తెలిసిందే.ఈ సమావేశంలో కీలక తీర్మానాలను ఆమోదించారు. అందులో భాగంగా యుపిఎస్ కు ఆమోదం తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అయితే ఇది వైసిపి ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీ పెన్షన్ స్కీం కి దగ్గరగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ ప్రవేశ పెడితే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకమయ్యారు. అదే సమయంలో చంద్రబాబు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వలేదు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించలేదు. అయినా సరే జగన్ దారుణంగా ఓడించారు ఉద్యోగులు. ఇప్పుడుటిడిపి భాగస్వామ్యమైన ఎన్ డి ఏ ప్రభుత్వం జిపిఎస్ ను పోలిన యుపిఎస్ పెన్షన్ స్కీంను ఆమోదించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

* గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తెచ్చిన జగన్
2019 ఎన్నికల్లో సిపిఎస్ ను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ను రద్దు చేసి గ్యారెంటీ పెన్షన్ స్కీమును తెరపైకి తెచ్చారు. పదవీ విరమణ చేయడానికి చివరి 12 నెలల్లో సదరు ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్న జీవితంలో యావరేజ్ బేసిక్ శాలరీ ఆధారంగా గ్యారెంటీ పెన్షన్ స్కీమును రూపొందించారు. యావరేజ్ బేసిక్ వేతనంలో 50% మొత్తాన్ని జిపిఎస్ పెన్షన్ గా అందిస్తామని అప్పట్లో జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.కానీ దీనిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. కానీ జగన్ సర్కార్ తీసుకొచ్చిన జిపిఎస్ నే.. ఇప్పుడు మోడీ సర్కార్ యునైటెడ్ పెన్షన్ స్కీమ్ గా మార్చి అమలు చేయనుంది.

* మూడు కేటగిరీలుగా
యునైటెడ్ పెన్షన్ స్కీమును మూడు కేటగిరీలుగా విభజించారు. 25 సంవత్సరాలకు పైగా సర్వీసు ఉన్నవారు, పది నుంచి 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలలోపు సర్వీసు ఉన్నవారిని కేటగిరిల వారీగా విభజించారు. పింఛన్ అమలులో దీనిని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. అయితే ఇదే స్కీమును జగన్ సర్కార్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకించారు. విపక్షంగా ఉన్న టిడిపి సైతం ఉద్యోగులను ప్రభుత్వం వంచిస్తోందని ఆరోపణలు చేసింది.

* చంద్రబాబు స్పందించాల్సిందే
ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. నాడు ఇదే పెన్షన్ స్కీమును జగన్ సర్కార్ ప్రవేశపెడితే చంద్రబాబు వ్యతిరేకించారు. ఇప్పుడు తాము భాగస్వామ్యంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా? లేదా? చూడాలి. వ్యతిరేకిస్తే రాష్ట్రంలో ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాల్సి ఉంటుంది. సమర్థిస్తే మాత్రం అప్పటి జగన్ సర్కార్ జిపిఎస్ స్కీము మంచిదేనని ఒప్పుకున్నట్టే. చంద్రబాబు ఎలా ముందుకెళ్లినా ఇబ్బందికరమే.