MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ( graduate MLC ) ఎన్నికల్లో టిడిపి విజయం సంపూర్ణం. ఇప్పటికే కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానాన్ని టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజా కైవసం చేసుకున్నారు. తాజాగా ఉపయోగ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఘనవిజయం సాధించారు. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తంగా 1,12,331 ఓట్లను రాజశేఖర్ సాధించారు. పిడిఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు 41,268 ఓట్లను మాత్రమే పొందారు. దీంతో రాజశేఖర్ 71,063 ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
Also Read : 5 ఎమ్మెల్సీ స్థానాలు క్లీన్ స్వీప్.. జగన్ నియోజకవర్గంలో కూడా.. ఇదీ ‘కూటమి’ దండయాత్ర
* రాజా రికార్డు స్థాయి విజయం
ఇప్పటికే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ( alapati Rajendra Prasad )భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఇంతటి రికార్డు స్థాయి విజయం ఎప్పుడు నమోదు కాలేదని తెలుస్తోంది. అయితే సోమవారం అర్ధరాత్రికే కృష్ణ గుంటూరు పట్టభద్రుల స్థానానికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆలపాటి రాజా విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంబంధించి టిడిపి అభ్యర్థి రాజశేఖర్ గెలుపుతో కూటమిలో సందడి వాతావరణం నెలకొంది.
* అన్ని స్థానాలు స్వీప్
తాజాగా ఈ రెండు స్థానాల గెలుపుతో టిడిపి కూటమి( TDP Alliance ) ఏపీలో పట్టభద్రుల స్థానాలను స్వీప్ చేసినట్లు అయింది. 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంతో పాటు తూర్పు,పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాలను అప్పట్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా ఈ రెండు స్థానాల గెలుపుతో ఏపీలో పట్టభద్రుల స్థానాలన్నీ టిడిపి ఖాతాలో పడినట్లు అయింది.
* వైసిపి ప్రచారం ఉత్తదే
అయితే ఏపీలో వ్యతిరేకత ఉందని.. కూటమి సంక్షేమ పథకాలను( welfare schemes) అమలు చేయకపోవడంతో వ్యతిరేకత నెలకొందని విపక్షాలు ప్రచారం చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతు తెలిపింది. అయితే భారీ మెజారిటీతో టిడిపి అభ్యర్థులు విజయం సాధించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది.
Also Read : సూపర్ విక్టరీ.. ఎమ్మెల్యేగా ఛాన్స్ మిస్..ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా!