MLC Elections : ఏపీలో ( Andhra Pradesh) మరో ఎమ్మెల్సీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. రెండు పట్టభద్రులతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. ఈరోజు రాత్రికి వీటికి సంబంధించి ఫలితాలు రానున్నాయి. ఈలోపే శాసనమండలిలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 29న శాసనమండలిలో ఐదుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు పదవీ విరమణ చేస్తున్నారు. వీరి రిటైర్మెంట్, ఎమ్మెల్సీ సీట్ల ఖాళీ పై ఈరోజు మండలి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇప్పటికే వీటి ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.
Also Read : రాజకీయాలను మరిచిపోలేకపోతున్న విజయసాయిరెడ్డి!
* మండలి నోటిఫై
వీళ్ళ రిటైర్మెంట్ ను మండలి నోటిఫై చేశాకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మండలి గెజిట్ నోటిఫికేషన్( gejit notification) ఇవ్వడంతో ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది. ముందుగా ఈ సి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13న నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
* అర్ధరాత్రి వరకు కౌంటింగ్
ఈరోజు పట్టభద్రుల స్థానాలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ( teachers MLC) ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. ఈ రాత్రి వరకు కౌంటింగ్ కొనసాగనుంది. అర్ధరాత్రి దాటాక ఫలితాలపై స్పష్టత రానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగా లెక్కించారు. అనంతరం తొలి ప్రాధాన్యం ఓట్లను లెక్కిస్తున్నారు. వాటి విషయంలో ఒక క్లారిటీ వచ్చాక రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీలో లేకుండా పోయింది. కూటమి తరపున టిడిపి అభ్యర్థులు బరిలో ఉన్నారు. పిడిఎఫ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థికి కూటమి మద్దతు ప్రకటించింది.
Also Read : వంగవీటి రాధాకు గ్రీన్ సిగ్నల్.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త సమీకరణలు!