https://oktelugu.com/

Perni Nani : ఎర్రటి ఎండలో నడుస్తున్న ముసలావిడను చూసి చలించిన పేర్ని నాని.. ఏం చేశాడో తెలుసా?

కాలికి సరిపోయాయా? లేదా? అని ఆమెను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగుచూస్తున్నాయి.వైరల్ అవుతున్నాయి. పేర్ని నానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : May 17, 2023 / 08:45 AM IST
    Follow us on

    Perni Nani : ప్రత్యర్థులపై విరుచుకుపడడమే కాదు… తనకు మంచి మనసుందని చాటుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రస్తుతం ఆయన చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అభినందనల కామెంట్ పెడుతున్నారు. చేసింది చిన్నసాయమే అయినా అందులో మానవత్వం ఉండడంతో అభినందించక తప్పడం లేదు.

    ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందిగా ఉంది. అటువంటిది ఓ మహిళ మిట్ట మధ్యాహ్నం చెప్పులు లేకుండా బయటకు వచ్చింది. కాలే ఎండలో రహదారిపై నడుచుకుంటూ వెళుతుంది. గమనించిన పేర్ని నాని కారు ఆపి మహిళను ఎక్కించుకున్నారు. ఓ దుకాణానికి తీసుకెళ్లి చెప్పులు కొనిపెట్టారు. దీంతో మహిళ కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు.

    తన సొంత నియోజకవర్గం మచిలీపట్నంలో పేర్ని నాని పర్యటిస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం తీక్షణమైన ఎండలో మహిళ కనిపించడంతో చలించిపోయారు. ఆమె గురించి వాకబు చేస్తే పేదరికంతో బాధపడుతోందని తెలుసుకున్నారు. అందుకే స్వయంగా చెప్పుల దుకాణానికి తీసుకెళ్లారు. చెప్పులు కొనిపెట్టారు. కాలికి సరిపోయాయా? లేదా? అని ఆమెను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగుచూస్తున్నాయి.వైరల్ అవుతున్నాయి. పేర్ని నానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.