Eating In Leaves: పూర్వ కాలంలో భోజనం ఆకుల్లోనే చేసేవారు. ఇలా చేయడం వల్ల మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రస్తుత కాలంలో ఆకులో భోజనం చేయడం నామోషీగా ఫీలవుతున్నారు. పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు. కానీ ఆకుల్లో తినడానికి అంగీకరించడం లేదు. దీంతో ఆకులు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇలా ఆకులలో తినడం వల్ల మనకు మేలు కలుగుతుంది. ఇప్పుడు అందరు ఆకులను మరచిపోయారు.
అరటి ఆకులో భోజనం చేస్తే ఆకలి త్వరగా వేస్తుంది. మోదుగ ఆకులో తినడం వల్ల నేత్ర దోషాలు లేకుండా పోతాయి. టేకు ఆకులో భోజనం చేయడం వల్ల భవిష్యత్, వర్తమానాలు తెలుసుకునే సత్తా పెరుగుతుంది. రావి ఆకులో భోజనం చేయడం ద్వారా జననేంద్రియాల దోషాలు తొలగిపోతాయి. చిన్న పిల్లలకు మాటలు రావడం జరుగుతుంది. ఇలా ఆకుల్లో భోజనం చేయడం ద్వారా మనకు ఎన్నో లాభాలుంటాయి.
తామరాకులో భోజనం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. బాదం ఆకులో తింటే మంచి చిత్తం కలవారై ఉంటారు. మర్రి ఆకుల్లో భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. జమ్మి ఆకులో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి కలుగుతుంది. ఇలా వివిధ ఆకుల్లో తినడం ద్వారా మనకు ఎన్నో రకాల శక్తులు వస్తాయి.
పచ్చని ఆకుల్లో భోజనం చేయడం ద్వారా మనకు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అనారోగ్యాలను దూరం చేసి మనకు ఆరోగ్యం కలిగించే విధంగా ఆకుల్లో ఎంతో బలం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఆకుల్లో భోజనం చేయడం లేదు. ఫలితంగా అనేక రకాల రోగాలకు మూలంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకుల విలువ తెలుసుకుని వాటిలో భోజనం చేసేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఏర్పడుతోంది.