MLA Attempts Law Entrance : ఏపీలో ( Andhra Pradesh)లా సెట్ ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు ప్రముఖులు హాజరయ్యారు. సాధారణంగా విద్యార్థులు కంటే నడివయస్కులు ఎక్కువగా లాసెట్ రాస్తుంటారు. ఎందుకంటే చట్టాలపై అవగాహన, హక్కుల కోసం పోరాడే క్రమంలో చాలామంది న్యాయవాద వృత్తి వైపు అడుగులు వేయాలని భావిస్తారు. ఏపీవ్యాప్తంగా నిన్ననే లాసెట్ ప్రశాంతంగా జరిగింది. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, రిటైర్డ్ డిజి ఏబీ వెంకటేశ్వరరావు పరీక్షకు హాజరయ్యారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆసక్తితోనే పరీక్ష రాసినట్లు తంగిరాల సౌమ్య తెలిపారు. న్యాయ శాస్త్రం పై మక్కువతోనే లా సెట్ రాసినట్లు మాజీ డీజీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లా సెట్ పరీక్ష జరగగా.. ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
* తండ్రి బాటలో..
రాష్ట్ర వ్యాప్తంగా 188 కేంద్రాల్లో లా సెట్( Law common entrance test ) నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ టిడిపి మహిళా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. విజయవాడ కండ్రికలోని సెంటర్లో పరీక్ష రాశారు. పాలనకు చట్టాలపై అవగాహన ఉంటే ప్రయోజనంగా ఉంటుందని సౌమ్య న్యాయవాద వృత్తి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సౌమ్య తండ్రి ప్రభాకర్ రావు కూడా లాయరే. తన తండ్రి పేదలకు న్యాయ సేవలు అందించారని.. ఆయన స్ఫూర్తితోనే న్యాయ శాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వాస్తవానికి తంగిరాల సౌమ్య బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశారు. అయితే తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు ఆకస్మిక మృతితో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.
* రిటైర్డ్ డిజి సైతం..
ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు( retired DG ab Venkateswara Rao ) కూడా లాసెట్ పరీక్ష రాశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలోని రైజ్ కాలేజీ సెంటర్లో పరీక్షకు హాజరయ్యారు. లాయరుగా ప్రాక్టీస్ చేయడం కంటే కూడా న్యాయ శాస్త్రం చదవాలని ఆసక్తితో రాసినట్లు తెలిపారు. చాలా రకాల సెక్షన్లు గురించి తెలుసుకోవాలని ఉద్దేశంతోనే న్యాయవిద్య అభ్యసించినట్లు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం వెంకటేశ్వరరావు పై అనేక కేసులు నమోదు చేసింది. అప్పట్లో ఆయనే స్వయంగా కోట్లు వాదనలు వినిపించారు. ఇప్పుడు లా చదివేందుకు సిద్ధమయ్యారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఏబీ వెంకటేశ్వరరావుకు కేటాయించారు. కానీ ఆయన తీసుకోలేదు.
* ఈనెల చివర్లో ఫలితాలు..
రాష్ట్రవ్యాప్తంగా న్యాయవిద్యలో ( law education )ప్రవేశం కోసం లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరానికి గాను మూడేళ్ల ఎల్.ఎల్.బి, ఐదు సంవత్సరాల ఎల్.ఎల్.బి, రెండు సంవత్సరాల ఎల్ఎల్ఎం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను లా సెట్ నిర్వహించారు. ఈ ఏడాది లా సెట్ నిర్వహణ బాధ్యత పద్మావతి మహిళా యూనివర్సిటీ తీసుకుంది. జూన్ చివరి వారంలో ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.