Anirudh Reddy Warning to Pawan: తెలంగాణ ప్రజల దిష్టి తాకడంతోనే కోనసీమ పచదనం కోల్పోతోందని, కొబ్బరి చెట్టు కాయడం లేదని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారం క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యల రచ్చ కొనసాగుతోంది. మొదట పవన్ వ్యాఖ్యలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, తర్వాత జడ్చర్చ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, తర్వాత సూర్యపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత జగదీశ్‌రెడ్డి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. తర్వాత మంత్రులు కోమటిరెడ్డి వెంటకరెడ్డి, శ్రీధర్‌బాబు, వాకిట శ్రీహరి స్పందించారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడవని సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అయినా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలపై స్పందించడం లేదు. జనసేన నేతలు కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
స్పందించకుంటే మ తడాఖా చూపిస్తాం..
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు క్షమాపణలు చెప్పకపోవడం, స్పందించకపోవడం తప్పుడని అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. తమకు సెంటిమెంట్ ఎక్కువ అని స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో ఎవరు అణుచిత వ్యాఖ్యలు చేసినా ఊరుకోబోమని హెచ్చరించారు. సబ్బండవర్గాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అవమానించేలా మాట్లాడిన పవన్ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. పవన్ మౌనం రాజకీయ వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని తెలిపారు.
జడ్చర్లలో నీ సినిమాలు ఆడవు..
జడ్చర్ల ఎమ్మెల్యేగా సుధీర్‌రెడ్డి కఠిన నిర్ణయం తీసుకున్నారు. పవన్ స్పందించకుంటే రాష్ట్రంలో ఏమో కానీ, జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన పవన్‌కు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. అయినా పవన్ మౌనం ఎందుకు పాటిస్తున్నారు అన్నది అంతు చిక్కడం లేదు.
తెలంగాణ సెంటిమెంట్‌తో ముందుకు సాగే ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ అంశంపై స్పందిస్తారని అనిరుధ్ ఆశాభాసం వ్యక్తం చేశారు. ఈ వివాదం కాంగ్రెస్ పార్టీలో ఐక్యతను పెంచుతుందని సూచించారు. తెలంగాణ అంటే అంత అలుసా అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. పవన్ మాత్రం తెలంగాణకు క్షమాపణ చెబితే ఆంధ్రాలో పరువు పోతుంది అన్న భావనలో ఉన్నారు. అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
పవన్ కళ్యాణ్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇకపై జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఆడనివ్వను
పవన్ కళ్యాణ్ నన్నేం పీకుతారని అనుకోని క్షమాపణలు చెప్పడం లేదు, కనీసం స్పందించడం కూడా లేదు
వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే… https://t.co/5ZeMuStocw pic.twitter.com/UtcVJY86Cu
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2025