Homeజాతీయ వార్తలుHeartwarming army gesture: గ్రేట్ ఇండియన్ ఆర్మీ.. అమర వీరుడి కూతురికి అన్నీ తామై!

Heartwarming army gesture: గ్రేట్ ఇండియన్ ఆర్మీ.. అమర వీరుడి కూతురికి అన్నీ తామై!

Heartwarming army gesture: సరిలేరు నీకెవరు అనే సినిమా చూశారా.. అందులో మహేష్ బాబు తనతో పాటు పనిచేసే సైనికుడు చనిపోతే తట్టుకోలేక పోతాడు చివరికి చనిపోయిన ఆ సైనికుడి సోదరి వివాహానికి వెళ్తాడు ఆ వివాహాన్ని మొత్తం తను దగ్గరుండి జరిపిస్తాడు సైనికుడి కుటుంబానికి దగ్గరవుతాడు చూసేందుకు ఈ సన్నివేశాలు సినిమాటిక్ మాదిరిగా కనిపించినప్పటికీ మన ఇండియన్ ఆర్మీ చేసే పనులు మొత్తం అలానే ఉంటాయి దేశ సంరక్షణ మాత్రమే కాదు, తమ తోటి సైనికుల బాధ్యతని కూడా వాళ్ళు భుజాల ఎత్తుకుంటారు కష్ట కాలంలో అండగా నిలిచి సమష్టి అనే భావనను నిజం చేసి చూపిస్తారు.

ఇండియన్ ఆర్మీ చేసే సాహసాలు అద్భుతంగా ఉంటాయి దేశ సంరక్షణలో ఇండియన్ ఆర్మీ వెనుకాడదు పైగా సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం వదిలేస్తుంటారు ముందు దేశం తర్వాత ప్రాణం అన్నట్టుగా ముందుకు వెళుతుంటారు చైనా నుంచి మొదలు పెడితే పాకిస్థాన్ వరకు ప్రతి సరిహద్దులోనూ ఇండియన్ ఆర్మీ నిత్యం కనిపెట్టుకొని ఉంటుంది కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుకుంటూ ఉంటుంది ఇండియన్ ఆర్మీ చూపించే ధైర్యం భారత దేశానికి ఎనలేని బలం.

దేశ సంరక్షణ మాత్రమే కాదు, తమ తోటి సైనికుడు ఆపదలో ఉంటే చాలు ఇండియన్ ఆర్మీ రెక్కలు కట్టుకొని వాలుతుంది. ఆపద ఎలాంటిదైనా.. కష్టం ఎలాంటి రూపంలో ఉన్నా ఇండియన్ ఆర్మీ లో పని చేసే సైనికులు భుజం కాస్తు ఉంటారు. అటువంటి సంఘటన ప్రస్తుతం ఢిల్లీలో ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారందరి కంట కన్నీరు తెప్పిస్తోంది.. ఈ వీడియోని చూసిన వారంతా శభాష్ ఇండియన్ ఆర్మీ అంటూ పొగుడుతున్నారు. ఇండియన్ ఆర్మీ దేశ సంరక్షణ మాత్రమే కాదు, తోటి సైనికుల బాధ్యతను కూడా భుజాన మోస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలోని గ్రేటర్ నోయిడా పరిధిలో దబ్ర అనే గ్రామంలో ముస్కాన్ అనే యువతి వివాహం జరిగింది. ముస్కాన్ తండ్రీ పేరు సురేష్ సింగ్. ఇతడు సైన్యంలో పనిచేసేవాడు. సైన్యంలో పనిచేస్తుండగా ఒక ఆపరేషన్ లో పాల్గొన్నాడు. అందులో అతడు వీరమరణం పొందాడు. సురేష్ సింగ్ చేసిన సేవలను గుర్తించుకొని తోటి సైనికులు ముస్కాన్ వివాహానికి హాజరయ్యారు. తండ్రి స్థానంలో నిలబడి ముస్కాన్ కు కన్యాదానం చేశారు. తామంతా ఒకటే కుటుంబం అని నిరూపించారు. ముస్కాన్ తండ్రి తరఫున కన్యాదానం చేస్తుంటే వివాహానికి హాజరైన వారంతా కన్నీరు పెట్టారు. దేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నా.. ఇంకా ఎన్ని భాషలు ఉన్నా.. దేశ సంరక్షణ అనగానే తాము ఒకటి అవుతామని.. తోటి సైనికుడికి కష్టం వస్తే తామంతా అండగా నిలబడతామని మరోసారి నిరూపించారు భారత సైనికులు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular