https://oktelugu.com/

Minister Nara Lokesh : పెన్ను, పేపర్ ఖర్చు రూ. 9.8 కోట్లు..వైసీపీ పై మాస్ టీజింగ్

కూటమి ప్రభుత్వం పై వ్యతిరేక ప్రచారం చేస్తోంది వైసిపి. కానీ ఎక్కడికి అక్కడే అడ్డంగా బుక్ అవుతుంది. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయంలో స్టేషనరీ ఖర్చు బయటపడింది. ఈ ఐదేళ్లలో పెన్ను, పేపర్ల కోసం రూ.9.8 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 9, 2024 / 02:30 PM IST

    Nara Lokesh

    Follow us on

    Minister Nara Lokesh : ఏపీలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై ఉక్కు పాదం మోపుతున్నారు ఏపీ పోలీసులు.రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేసులను నమోదు చేస్తున్నారు. చాలామందిని అరెస్టు చేశారు కూడా. ఈ నేపథ్యంలో వైసిపి అనుకూల సోషల్ మీడియా వ్యక్తుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది.నిన్నటి వరకు సోషల్ మీడియా పోస్టులతో దూకుడు కనబరిచిన శ్రీ రెడ్డి లాంటివారు సైతం వెనక్కి తగ్గుతున్నారు.క్షమించాలని కూటమి పెద్దలను కోరుతున్నారు. గత ఐదేళ్లలో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అనుచిత వ్యాఖ్యలు, బూతులతో ఇబ్బంది పెట్టిన వారంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో గడుపుతున్నారు.అయితే వైసిపి లీగల్ విభాగం బాధితులకు అండగా నిలుస్తోంది. ఏకంగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తోంది. అయితే ఏ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారో.. అదే సోషల్ మీడియాను సాధనంగా మార్చుకుంది టిడిపి. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను బయట పెడుతోంది. ఆధారాలు, లెక్కల తో సహా చూపించేందుకు ప్రయత్నిస్తోంది.

    * ఆ విషయాన్ని బయటపెట్టిన లోకేష్
    తాజాగా మంత్రి నారా లోకేష్ వైసీపీ హయాంలో స్టేషనరీ ఖర్చును బయటపెట్టారు. గత ఐదేళ్లలో పెన్నులు, పేపర్లు, ఇతర స్టేషనరీ వస్తువుల కోసం 9.84 కోట్ల రూపాయల ఖర్చు చేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటికే తన ఇంటి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ కోసం 12.85 కోట్లు, ఎగ్ పఫ్ ల కోసం 3.6 2 కోట్లు, ఇంటి ముందు రోడ్డు వేయడానికి ఐదు కోట్లు, ఎలకలు పట్టడానికి 1.36 కోట్లు, ప్రహరీ గోడ నిర్మాణానికి 10 కోట్లు, 986 మంది సెక్యూరిటీకి దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఇప్పటికే టిడిపి ఆరోపణలు చేసింది. ఇప్పుడు కొత్తగా ఈ స్టేషనరీ ఖర్చును బయటపెట్టారు లోకేష్. అదే విషయంపై ఒక పోస్టర్ను సోషల్ మీడియాలో అధికారికంగా పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.

    * ఆ పోస్ట్ సారాంశం ఇదే
    తాజాగా తెలుగుదేశం పార్టీ పెట్టిన ఈ పోస్టులో..’ ప్రజల వ్యక్తిగత ఆస్తుల మీద తన పేరు చెప్పుకోవడం కోసం 700 కోట్ల రూపాయలు.. ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు వేయడానికి 1300 కోట్ల రూపాయలు.. సాక్షి పత్రిక కోసం 420 కోట్ల రూపాయలు.. అబ్బో అసలు ప్రజాధనాన్ని ఇంతగా దుర్వినియోగం చేసినోడు చరిత్రలో లేడు’ అంటూ ఎక్స్ ఖాతాలో టిడిపి చేసిన పోస్టు సైతం వైరల్ గా మారింది. దానికి జత చేస్తూ పోస్టర్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇదేం మాస్ టీజింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు