Mekapati Rajamohan Reddy: సీనియర్ నేతలంతా( senior leaders ) జిల్లాల్లో ఉండిపోతే.. దూకుడుగా బూతులు మాట్లాడే నేతలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట వైసీపీ పెద్దాయన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా అయితే కష్టమని తేల్చేశారు. మారాల్సింది అధినేత జగన్మోహన్ రెడ్డి అని కుండబద్దలు కొట్టారు. చుట్టూ భజన పరులు చేరి.. వారే పార్టీని నట్టేట ముంచుతున్నారు అన్నది మేకపాటి వారి అభిప్రాయం. అయితే అది ముమ్మాటికి నిజం. 2014లో అదే భజన పరులు.. 2019లో మారిన భజనపరులు.. 2024లో మిగిలిన భజనపరులు.. ఇలా ఎప్పుడు చూసినా భజన పరులతోనే నిండిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రెండు ఎన్నికలకు వెళ్తే ఒకసారి మాత్రమే విజయం సాధించింది. అయితే అలా గెలుపొందినప్పుడు కూడా భజన పరులు విడిచిపెట్టలేదు. ఇప్పటికీ కొనసాగుతుండడంతో మేకపాటి వంటి సీనియర్ నేతకు ఆగ్రహం వచ్చింది. సుతి మెత్తగా సుత్తి లేకుండా అధినేతకు హెచ్చరించేదాకా పరిస్థితి వచ్చింది.
రంగంలోకి బూతు నేతలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం సమయంలో కొంతమంది నేతలు ఉండేవారు. మర్యాదస్తులుగా పిలుచుకునే నేతలు ఆ పార్టీలో పని చేయడం ప్రారంభించారు. చాలా హుందాగా రాజకీయాలు చేశారు. కానీ అలాంటి మర్యాదస్తులు పార్టీకి అవసరం లేదన్నట్టు 2014 ఓటమితో గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. బలమైన తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలంటే కావాల్సింది మర్యాదస్తులు కాదని.. గట్టిగా దూకుడుగా మాట్లాడిన నాయకులు అవసరం అని భావించారు జగన్మోహన్ రెడ్డి. అలా వచ్చిన వారే కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు. వైసీపీ ఆవిర్భావం నుంచి వచ్చిన నేతలు పక్కకు వెళ్లిపోయారు. ఇలా దూకుడు కలిగిన నేతలు వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వల్లభనేని వంశీ మోహన్ లాంటి వారు తోడయ్యారు. అయితే ఎల్లకాలం అది వర్క్ అవుట్ కాదు. తిట్టినంతమాత్రాన గెలుపు కాదు. దూకుడు అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. 2024 ఎన్నికల్లో ఓడిపోయేసరికి అసలు తత్వం బోధపడింది కానీ.. మర్యాదస్తులను ప్రయోగిద్దాం అంటే మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. దూకుడు తనం అలవాటు పడిన నేతలు జగన్ మాట వినడం లేదు.
ఆయన వాదనల్లో వాస్తవం..
మేకపాటి రాజమోహన్ రెడ్డి( Raja Mohan Reddy ) చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని మెజారిటీ వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆత్మీయుడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. జగన్మోహన్ రెడ్డి మంచి కోరేవాడు. ఆయన నేరుగా పార్టీలో బూతు నాయకులకు పెద్దపీట వేసి.. మర్యాదస్తులను పక్కకు పెట్టేయడాన్ని ప్రస్తావించారు. పనితీరు మార్చుకోవాలని నేరుగా అధినేత జగన్మోహన్ రెడ్డిని చెప్పలేక.. పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఇక తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి.