Mega Brother Nagababu : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు. తన మనసులో ఉన్న మాటలను, అభిప్రాయాలను ఇట్టే వ్యక్తపరుస్తారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఎక్కువగా స్పందిస్తారు నాగబాబు. ఆయన సోషల్ మీడియాలో చేసే పోస్టింగ్ లు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇటీవల పవన్ విషయంలో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అయింది.ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యసభ పదవిని నాగబాబుకు కేటాయిస్తారని ప్రచారం నడిచింది. దానికోసమే డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీకి వెళ్లినట్లు తెగ హడావిడి నడిచింది. నాగబాబు కోసం పవన్ లాబీయింగ్ చేస్తున్నారని కూడా సరికొత్త ప్రచారం ఒకటి మొదలైంది. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు నాగబాబు. తనకు ఆ పదవి ఆకాంక్ష లేదని.. పవన్ ఢిల్లీ వెళ్ళింది తన కోసం కాదని.. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పుకొచ్చారు నాగబాబు.అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. తద్వారా తన విషయంలో పవన్ ను అడ్డం పెట్టుకుని జరుగుతున్న ప్రచారానికి చెక్ చెప్పారు. తాజాగా ఆయన మరో పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో…
* వివేకానంద బోధనలతో
స్వామి వివేకానంద బోధనలను తన పోస్టులో గుర్తు చేశారు.’ మీరు తప్పు మార్గంలో ఉన్నారని మీరు గుర్తిస్తే.. వెంటనే మీ మార్గాన్ని సరిదిద్దుకోండి. మీరు ఎంత ఎక్కువ కాలం వేచి ఉన్నారో. మీరు నిజంగా ఎక్కడి నుండి వచ్చారో తిరిగి పొందడం కష్టం’ అంటూ పోస్ట్ చేశారు నాగబాబు. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. మిత్రపక్షంగా టిడిపి తో పాటు బిజెపి కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది రాజకీయ ప్రత్యర్థులకో.. లేకుంటే మిత్రపక్షాల్లో గిట్టని వారి పైనో కాదు. అయితే అల్లు అర్జున్ పై పెట్టి ఉంటారన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.
* ఇటీవల పరిణామాలతో
మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చారు అల్లు అర్జున్. కానీ ఇటీవల ఆయన సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారు. ఈ ఎన్నికలకు ముందు మెగా కుటుంబమంతా కూటమికి మద్దతు తెలిపితే.. అల్లు అర్జున్ మాత్రం వైసిపి అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. అప్పటినుంచి మెగా కుటుంబంలో ఒక రకమైన రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో మెగా అభిమానులు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా ఈనెల ఐదున విడుదల కానుంది. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ తరుణంలోనే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.అయితే దీనికి ఎటువంటి ధ్రువీకరణ లేదు.
అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు .
అతను ఎప్పుడు సత్యానికి,ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన purpose స్వార్థ… pic.twitter.com/WMYYnRL0IY— Naga Babu Konidela (@NagaBabuOffl) November 29, 2024