YCP social media : మెగా, అల్లు కుటుంబ వైఫల్యమే వైసీపీకి వరం.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ప్రచారం!

దేశంలోనే వైసీపీ సోషల్ మీడియా అత్యంత పవర్ ఫుల్. ప్రత్యర్థుల విషయంలో ఆ పార్టీ సోషల్ మీడియా చేసే అతి ఇంతా అంతా కాదు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎపిసోడ్లో అడ్డగోలుగా దూరి.. ఆ రెండు కుటుంబాల్లో చీలికకు కారణమవుతోంది వైసీపీ సోషల్ మీడియా.

Written By: Dharma, Updated On : August 28, 2024 10:14 am

YCP Social media

Follow us on

YCP social media : వైసిపి పుట్టెడు కష్టాల్లో ఉంది. ఆ పార్టీ శ్రేణులకు సైతం భవిష్యత్తుపై నమ్మకం లేదు. ఇటువంటి సమయంలో ఆ పార్టీకి అల్లు అర్జున్ కొండంత అండగా కనిపిస్తున్నాడు. ఆయనను తమ వాడిగా చూపుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. కష్టంలో ఉన్న వాడికి కొంచెమైనా సాయం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. అటువంటి అవకాశం కోసమే వైసీపీ ఎదురుచూస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేన అతి చేస్తోంది.అల్లు అర్జున్ ఎపిసోడ్ ను భూతద్దంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది.అది అంతిమంగా జనసేనకే నష్టం చేస్తుంది. వైసీపీ ఇబ్బందుల్లో ఉంది కనుక ఆ పార్టీకి చిన్న అంశం కూడా అవసరమే. కానీ ఇక్కడ సహనంతో ఉండాల్సింది వైసీపీయే. ఎన్నికల్లో అల్లు అర్జున్ తన భార్య తరపు స్నేహితులుగా భావిస్తున్న వారికి అండగా నిలవాలని భావించారు. అసలు ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించలేదు. కానీఅటు వైసిపి అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఇటు జనసేన సైతం ఇబ్బందిగా భావించింది. భూతద్దంలో పెట్టి చూసింది. జనసేన అంతులేని మెజారిటీ సాధించడంతో అల్లు అర్జున్ చేసిన వ్యవహారం చెడింది. తాజాగా అల్లు అర్జున్ మామ స్పందించడం.. దానికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి స్పందించడం వైసీపీకి వరంగా మారింది.ఆ పార్టీ సోషల్ మీడియా గురించి తెలియంది కాదు. ఏమాత్రం అడ్వాంటేజ్ వచ్చినా వైసీపీ సోషల్ మీడియా విడిచిపెట్టదు. ఇది తెలిసి కూడా జనసేన శ్రేణులు అల్లు అర్జున్ విషయంలో అతి చేస్తున్నాయి.

* అల్లు అర్జున్ లో తప్పేముంది
తన భార్య తరపు స్నేహితులు కనుక అల్లు అర్జున్ స్పందించారు.ఆయన వైసీపీకి మద్దతు తెలపలేదు.ఆ పార్టీ విధానాలకు జై కొట్టలేదు. కేవలం స్నేహితుడికి శుభాకాంక్షలు మాత్రమే తెలిపారు.నేరుగా నంద్యాల వెళ్లారు.శుభాకాంక్షలు తెలిపారు.అంతటితో ఆ వివాదాన్ని విడిచి పెడితే సరిపోయేది. పోనీ అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. ఆయన గెలిచారా? అంటే అదీ లేదు.కానీ దానిపై లేనిపోని రాద్ధాంతం చేసి కుటుంబంలో చీలికకు ముమ్మాటికీ జనసైనికులే కారణమవుతున్నారు. దానికి ఇబ్బందులు పడాల్సింది కూడా జనసేన పార్టీయే.

* మెగా కుటుంబంలో చీలికకు కారణం
ఈ ఎన్నికల్లో శత శాతం గెలిచి హైప్ క్రియేట్ చేసింది జనసేన పార్టీ. ప్రత్యర్థులకు గుణపాఠం నేర్పింది. స్నేహితులకు సరైన హెచ్చరిక పంపింది. ఇటువంటి సమయంలో మెగా కుటుంబంలో చీలిక అంటే అది ముమ్మాటికీ జనసేనకు నష్టమే. పవన్ కళ్యాణ్ ఎన్నడు తన స్టార్ దమ్ ను నమ్మలేదు. తన వెంట మెగా కుటుంబం వస్తుందని ఆశించలేదు. కానీ అల్లు అర్జున్ ఎపిసోడ్ జనసైనికులు. లేనిపోని ప్రకటనలు,అప నమ్మకాలు, విమర్శలతో సమస్యను మరింత జఠిలం చేశారు. దీనిలో అల్లు అర్జున్ మామ పాత్రను క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో అల్లు కుటుంబంతో పాటు మామ పాత్రను తప్పుపట్టారు. సహజంగా అది ఇబ్బందికర అంశాలకు దారి తీసినట్టే.

* పవన్ ను వ్యతిరేకించని అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఎన్నడు పవన్ ను వ్యతిరేకించలేదు.మెగా ఫ్యామిలీని అధిగమించలేదు.కానీ మెగా అభిమానులే ఆ కుటుంబాన్ని డివైడ్ చేశారు.తమకున్న అభిమాన గణాన్నిడివైడ్ చేసేలా మాట్లాడారు. ఇప్పటికి వరకు వస్తున్న మెగా కాంపౌండ్ వాల్ ను అడ్డగోలుగా చీల్చేశారు. మెగా కుటుంబం, అల్లు కుటుంబం వేరని సంకేతాలు పంపారు. బహిరంగంగానే కొట్టుకున్నారు. వారికి లేని అభిప్రాయాలను ఆపాదించారు.ఒక్కమాటలో చెప్పాలంటే ఆ కుటుంబంలో అగాధాన్ని నింపిన వారిలో అభిమానులదే అగ్రస్థానం. ఇది ముమ్మాటికి వారి వైఫల్యమే. దీనినే వైసిపి అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది.