Homeఆంధ్రప్రదేశ్‌Mamata Banerjee like Jagan: అచ్చం జగన్ మాదిరిగా మమతా బెనర్జీ

Mamata Banerjee like Jagan: అచ్చం జగన్ మాదిరిగా మమతా బెనర్జీ

Mamata Banerjee like Jagan: రాజకీయ పార్టీల నేతల దూకుడు ఒక్కోసారి అక్కరకు వస్తుంది.. రాజకీయ ప్రయోజనాలను చేకూర్చుతుంది. కానీ ఒక్కోసారి వికటిస్తుంది కూడా. అయితే రాజకీయాలను రాజకీయంలాగే చేయాలి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన అందుకు మూల్యం తప్పదు. పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ చేసిన తప్పు కూడా అదే. 1998 వరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బయటకు వచ్చి సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. దాదాపు పది సంవత్సరాలు పోరాడి అధికారంలోకి రాగలిగారు. రెండుసార్లు అధికారాన్ని నిలబెట్టుకున్న ఆమె మూడోసారి మాత్రం చతికిల పడ్డారు. అయితే అధికారంలో ఉన్న దూకుడును కనబరుస్తున్నారు. అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు.

ఏపీలోనూ దూకుడు రాజకీయం..
మమతా బెనర్జీ మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్. దాదాపు ఏడు సంవత్సరాల పాటు పోరాటం చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. అంతులేని ప్రజామోదంతో వచ్చిన ఆయన.. తరువాత ఎందుకో ఏకపక్షంగా వ్యవహరించడం ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నం చేశారు. అది వికటించి ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేసింది. దారుణ పరాజయం ఎదురయింది జగన్మోహన్ రెడ్డికి. అయినా సరే అదే ధోరణితో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులకు భిన్నంగా సాగుతున్నారు. పార్టీలో ఇష్టం ఉంటే ఉండండి.. లేకుంటే వెళ్లిపోవచ్చు అనడంతో సీనియర్లు సైతం దూరమయ్యారు.

ఇష్టం లేకపోతే వెళ్లిపోండి..
బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇప్పుడు అదే మాట చెబుతున్నారు. తనతో ఉన్నవారు ఉండొచ్చు.. లేకపోయిన వారు వెళ్ళిపోవచ్చు అని తేల్చి చెబుతున్నారు. ఆ పార్టీ నుంచి 80 మందికి పైగా ఎమ్మెల్యేలు గెలిచారు. కొందరు బిజెపి టచ్ లోకి వెళ్లినట్లు మమతా బెనర్జీ అనుమానిస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రతీకార రాజకీయాలతో హత్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించాల్సింది పోయి దూకుడు మాటలు ఆడుతున్నారు మమత. అదే సమయంలో మమత పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకూడదని బిజెపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఓ 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఈ విషయం మమతా బెనర్జీకి తెలియడంతో ఆమె సొంత పార్టీ వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉంటే ఉండండి లేకుంటే వెళ్లిపోండి అని అనడం దుమారానికి దారి తీస్తోంది. సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి మమతా బెనర్జీ. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే బెంగాల్లో మమత వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version