Nara Lokesh: ఏది జరిగినా మన మంచికే.. ఇది తరచూ వినిపించే మాట కూడా. పెద్దవాళ్లు.. పెద్ద పెద్ద వాళ్లు చెప్పే మాట కూడా. ఇప్పుడు నారా లోకేష్ విషయంలో నిజం అవుతుంది. తెలుగు మాట్లాడలేడు.. తెలుగు ఉచ్చరించలేడు.. మంగళగిరి అనలేడు.. వేషం బాగుండదు.. వేషధారణ బాగుండదు.. శరీర ఆకృతి బాగుండదు.. అస్సలు రాజకీయాలకు పనికిరాడు.. ఇది నారా లోకేష్ గురించి ప్రత్యర్థులు ఆడే మాటలు. అందునా వైసిపి నేతల విషయానికి వస్తే పప్పు, అసమర్థుడు, నాయకత్వ లక్షణాలు లేని వాడు.. ఇలా ఎన్నెన్నో వర్ణాలు, అర్ధాలు వచ్చే కామెంట్స్, ఆరోపణలు, విమర్శలు లోకేష్ విషయంలో వినిపించేవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ అదే పార్టీ తలదించుకునేలా, విమర్శలకు సైతం తనదైన రీతిలో సమాధానం చెప్పి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు నారా లోకేష్.
* ప్రత్యర్థులకు ధీటుగా
ఒకప్పుడు నారా లోకేష్ బయటకు వస్తే ఏం తప్పు మాట్లాడుతాడు అని ఎదురుచూసే ప్రత్యర్ధులు ఉండేవారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు పనిగట్టుకొని కూర్చుండేవారు. వందలాదిమందిని మోహరించేవారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పుణ్యమా అని ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతున్నారు నారా లోకేష్. లోకేష్ భవిష్యత్తును తుంచేయాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ప్యాలెస్కే పరిమితం అయ్యారు. నారా లోకేష్ మాత్రం ఢిల్లీని చుట్టేస్తున్నారు. జాతీయస్థాయిలో తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు సాధిస్తున్నారు. తాజాగా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. తనకు జాతీయ స్థాయి ఉందని ఎలుగెత్తి చాటేలా వ్యవహరించబోతున్నారు.
*లోకేష్ అవసరాన్ని గుర్తించి..
బిజెపి పెద్దలకు ఒక లెక్క ఉంటుంది. 2019 నుంచి 2024 మధ్య అలానే నడిచింది. వారికి ఏపీ విషయంలో అవసరం లేకపోయినా.. జగన్మోహన్ రెడ్డి సహకారం పుష్కలంగా అందింది. అయితే 2024 వరకు ఒక ఎత్తు.. అటు తరువాత ఒక ఎత్తు అన్నట్టు పరిస్థితి మారింది. జగన్ అవసరం లేకపోయినా.. ఎదురెళ్లి బిజెపి అవసరాలను తీర్చారు. ఇప్పుడు బిజెపికి టిడిపి అవసరం వచ్చింది. అందుకే చంద్రబాబుతో పాటు నారా లోకేష్ విషయంలో బిజెపి సైతం తగ్గినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి బీహార్ ఎన్నికలు కీలకం. బీహార్ అంటేనే శ్రమజీవుల రాష్ట్రం. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణంలో బీహార్ కార్మికుల పాత్ర కీలకం. అమరావతి తో పాటు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిలో లోకేష్ పాత్రను గుర్తించారు బీహార్ వాసులు. అందుకే వారిని ఒప్పించేందుకు నారా లోకేష్ ను పిలిపించారు బిజెపి పెద్దలు.
* జాతీయస్థాయిలో గుర్తింపు..
సాధారణంగా భాషలతో సంబంధం ఉండేవారు సినీ నటులు. బీహార్ అనేసరికి తెలుగు నటులు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలు అక్కడ సుపరిచితం. కానీ నారా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు కుమారుడిగానే వారు చూస్తారు. కానీ ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి ప్రేక్షకులుగా బీహార్ వలస జీవులు ఉన్నారు. వారికి ఇక్కడ సినిమా యాక్టర్లు సుపరిచితం కాదు. నారా లోకేష్ లాంటి నేత వారికి సినిమా యాక్టర్ కంటే ఎక్కువ. దానిని గుర్తించారు బిజెపి పెద్దలు. అందుకే బీహార్ ఎన్నికల ప్రచారానికి పిలిపించారు. నిజానికి లోకేష్ కు ఇది మంచి తరుణం. కానీ ఎన్నెన్నో గడ్డు పరిస్థితులు తట్టుకొని ఈ స్థితికి వచ్చారు నారా లోకేష్. నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్.