Nara Lokesh on AP health sector: పూర్తిచేయని మెడికల్ కాలేజీలు చూపించి వైసిపి తాము ఏదో ఉద్ధరించామని ప్రచారం చేసుకుంటున్నది. వైసీపీ అధినేత ఆ దేశాలతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను వెంటేసుకుని నాయకులు తెగ తిరుగుతున్నారు. తాము ఏపీలో మెడికల్ కాలేజీలు నిర్మించామని.. గొప్పలు పోతున్నారు. వాస్తవానికి వైసీపీ నేతలు చెప్పినట్టుగా మెడికల్ కాలేజీల నిర్మాణం గొప్పగా జరగలేదు. పైగా అందులో మెజారిటీ కాలేజీలు పునాదుల దశలోనే ఉన్నాయి. ఒకటి రెండు మినహా మిగతావేవీ పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయాలంటే వేలకోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైసిపి మొదటి నుంచి కూడా విమర్శిస్తోంది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మొత్తం ప్రైవేటుపరం చేయబోతున్నదని.. అసలు వైద్యాన్ని మొత్తం ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టబోతున్నదని నానా యాగీ చేస్తోంది. చేతిలో అనుకూల మీడియా ఉంది కాబట్టి అడ్డగోలుగా విష ప్రచారం చేస్తోంది. వాస్తవానికి జరుగుతున్న వాస్తవం వేరు. వైసిపి చేస్తున్న విషప్రచారం వేరు. మనదేశంలో హైవేల నిర్మాణాన్ని పిపిపి పద్ధతిలో చేపట్టారు. వాటి వల్ల అనేక ప్రాంతాల రూపు రేఖలు మారిపోయాయి. అభివృద్ధి అనేది సరికొత్తగా కనిపించింది. రోడ్ల వల్ల ఏ స్థాయిలో గ్రామాల ముఖచిత్రాలు మారిపోతాయో అప్పటికేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరూపించింది. ఇవాల్టికి ఆ రహదారులు అద్భుతంగా ఉన్నాయి. దేశ ప్రగతికి సోపానాలుగా నిలుస్తున్నాయి.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా భవిష్యత్తులో అలాంటి ఫలితాన్ని ఏపీ ప్రజలకు అందించే అవకాశం ఉంది. కేవలం పిపిపి విధానంతోనే కూటమి ప్రభుత్వం ఆగిపోవడం లేదు. ప్రభుత్వ వైద్య విభాగానికి ఐటీ సేవలను అనుసంధానించి సరికొత్తగా మార్చాలనేది లోకేష్ ఆలోచన. ఉదాహరణకు ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే.. అతడికి అన్ని పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత అతడికి సత్వర చికిత్స ఇచ్చి.. మందులు ఇస్తారు. ఆ తర్వాత ఆ రోగికి ఒక ఐడి నెంబర్ కేటాయిస్తారు. ఈ ఐడి నెంబర్ రోగికి సంబంధించిన గుర్తింపు కార్డు లాంటిది. ఇకపై అతడు ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా.. ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే చాలు అతడి ఆరోగ్య పరిస్థితి మొత్తం సంబంధిత వైద్యులకు తెలుస్తుంది. ఆ తదుపరి అతనికి సోకిన జబ్బుకు చికిత్స అందిస్తారు.
వాస్తవానికి ఇలాంటి విధానం మనదేశంలో ఇప్పటివరకు లేదు. ఈ విధానాలను కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే పాటిస్తున్నాయి. దీనిని ప్రభుత్వరంగ వైద్య విభాగంలోకి తీసుకొస్తే సరికొత్తగా ఉంటుందని లోకేష్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల తన సహచర మంత్రులతో పేర్కొన్నారు. అయితే ఇది ఇప్పటివరకు చర్చల దశలోనే ఉంది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చబోతుందని తెలుస్తోంది.