Kantara 2: పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించిన ‘కాంతారా’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతారా 2′(Kanthara : Chapter 1) వచ్చే నెల 2వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రీకల్క్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కాంతారా చిత్రం లో కనిపించిన మ్యాజిక్ ఫ్యాక్టర్స్ ఎందుకో ఈ సినిమాలో మిస్ అయ్యినట్టు అనిపించిందని, సినిమా కూడా అలా నిదానంగా స్క్రీన్ ప్లే తో నడిస్తే చూడడం కష్టమని, అలా ఉండదు అనే అనుకుంటున్నాము అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొట్టింది.
అది ఏమిటంటే ఈ సినిమాని చూసేందుకు థియేటర్స్ లోకి వచ్చే వాళ్లకు మందు తాగే అలవాటు ఉండకూడదు, మాంసాహారులు అయ్యుండకూడదు, ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు అని ఒక ప్రకటన సోషల్ మీడియా లో హల్చల్ చేసింది. దీనిపై ఈ చిత్రమ్ డైరెక్టర్/ హీరో రిషబ్ శెట్టి స్పందిస్తూ ‘సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు. ఈ ప్రకటన చూసిన వెంటనే నేను షాక్ అయ్యి మా ప్రొడక్షన్ గ్రూప్ లో షేర్ చేశాను. ప్రొడక్షన్ వైపు నుండి కూడా ఇది ఫేక్ అని చెప్పారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ముమ్మాటికీ తప్పే. ఎవరు ఈ రూమర్ ని పుట్టించారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మనిషికి ఉన్న అలవాట్లు ఏదైనా అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. దానిని కంట్రోల్ చేసే ఉద్దేశ్యం మాకు లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఇప్పటికే మొదలయ్యాయి. అయితే బుకింగ్స్ ట్రెండ్ ఆశించిన స్థాయిలో లేదు. నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ కి ఇప్పటి వరకు కేవలం లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఒక పాపులర్ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ కి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా షాక్ కి గురి చేసే విషయం. ఇక ఈ చిత్రానికి ఊరట కలిగించే విషయం ఏమిటంటే కర్ణాటక లో టికెట్ రేట్స్ భారీ గా పెంచుకునే వెసులుబాటు ఉండడమే. ఎందుకంటే రీసెంట్ గానే కర్ణాటక ప్రభుత్వం టికెట్ రేట్స్ భారీగా పెంచుకోవడానికి వీలు లేదంటూ టికెట్ ప్రైజ్ కి క్యాప్ విధించింది. దీనిని సవాలు చేస్తూ నిర్మాతలు హై కోర్టు కి వెళ్లగా, హై కోర్ట్ ప్రభుత్వ జీవో కి స్టే విధించింది. దీంతో మేకర్స్ కి కాస్త ఉపశమనం దొరికినట్టు అయ్యింది.