MLC Nagababu First Speech: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. శాసనమండలిలో మాత్రం వైసిపి ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ఈ క్రమంలో శాసనమండలి శాసనసభ కంటే హైలైట్ గా నిలుస్తోంది. చాలా రకాల సంచలనాలకు శాసనమండలి వేదికగా ఉంటోంది. అయితే శాసనమండలిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దీంతో ప్రతి అంశము సంచలనమే. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ ఈరోజు శాసనమండలి వేదికగా చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వైరల్ అంశంగా మారింది.
కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీగా..
కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికయ్యారు. దీంతో శాసనమండలిలో జనసేన బలం పెరిగింది. జనసేన ఆవిర్భావించి సుదీర్ఘకాలం అవుతోంది. కానీ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది జనసేన. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి శత శాతం విజయం సాధించింది. అయితే శాసనసభలో ప్రాతినిధ్యం లభించినా.. శాసనమండలిలో మాత్రం జనసేనకు ప్రాతినిధ్యం తక్కువ. అయితే అనూహ్య పరిస్థితుల్లో మెగా బ్రదర్ నాగబాబు శాసనమండలికి ఎన్నికయ్యారు. కూటమి విజయానికి నాగబాబు ఎనలేని కృషి చేశారు. ఈ క్రమంలో ఆయన అభిరుచి మేరకు రాజ్యసభ పదవి ఇస్తారని అంతా భావించారు. అయితే సమీకరణాల్లో భాగంగా నాగబాబుకు అవకాశం దక్కలేదు. దీంతో సీఎం చంద్రబాబు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటన చేశారు. అయితే నాగబాబు చట్టసభల్లో సభ్యుడు కారు. దీంతో ముందుగా ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసుకుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కొద్ది రోజుల కిందట ఆయన ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. త్వరలో ఆయన మంత్రి కావడం ఖాయం.
పోలీస్ కేసుల ప్రస్తావన..
అయితే తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టారు మెగా బ్రదర్ నాగబాబు. ఆయనకు కూటమి పార్టీలతో పాటు వైసిపి సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే సభలో అడుగుపెట్టిన నాగబాబు కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఈరోజు శాసనమండలిలో ప్రత్యేకంగా ప్రసంగించారు నాగబాబు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న పోలీస్ కేసులు, దాని పరిష్కార మార్గాలపై మాట్లాడారు నాగబాబు. ఏపీలో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంటున్నాయని.. వాటికి పరిష్కార మార్గం చూపించాలని నాగబాబు కోరుతూ వచ్చారు. ఈరోజు శాసనమండలిలో పెండింగ్ కేసులపై గణాంకాలతో మాట్లాడారు మెగా బ్రదర్ నాగబాబు. సమకాలీన అంశాలపై నాగబాబు యాక్టివ్ గా ఉంటారు. ఈరోజు ఆయన శాసనమండలిలో చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలిసారిగా శాసనమండలికి హాజరైన ఆయన ఈరోజు మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శాసనసభ సమావేశాల్లో ఈరోజు నాగబాబు ప్రసంగం హైలెట్ గా నిలిచింది.
మండలి లో ఎమ్మెల్సీ నాగబాబు తొలి స్పీచ్#Janasena pic.twitter.com/gfyJ6xNSDL
— M9 NEWS (@M9News_) September 23, 2025