Legislative Council AP: ఏపీలో ( Andhra Pradesh)ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూటమి పావులు కదుపుతోంది. ఇటువంటి సమయంలో శాసనమండలిలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం వైపు శాసనమండలి చైర్మన్ మొగ్గు చూపుతున్నారు. ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. దానికి కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనమండలి చైర్మన్. ఆ రాజీనామాలు ఆమోదిస్తే శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతుంది. మరికొందరు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి శాసనమండలిని తమ వైపు తిప్పుకోనుంది కూటమి ప్రభుత్వం. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుంది. ఇన్ని రోజులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించక పోవడానికి అదే కారణం. కోర్టు జోక్యంతో ఇప్పుడు ఓ అయిదుగురు రాజీనామాలకు చైర్మన్ ఆమోదం తెలిపారు. అయితే జాకీయాఖానం రాజీనామాతో పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఆమె ఉపసహరించుకున్నారు. ఎందుకంటే ఆమెకు మరో ఆరు నెలల మాత్రమే పదవీకాలం ఉంది. ఆమె రాజీనామా చేసిన ఉప ఎన్నిక రాదట.
* వైసీపీకి షాక్..
శాసనమండలి ద్వారా రాజకీయాలను చేయాలనుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీకి శాసనమండలిలో బలం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన నాటికి శాసనమండలిలో ఆ పార్టీకి ఉన్న బలం 38 మంది ఎమ్మెల్సీలు. కానీ ఈ 18 నెలల కాలంలో ఓ ఆరుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేశారు. దీంతో వైసిపి బలం 32 కు చేరుకుంది. అయితే తాజాగా ఈ ఐదుగురు ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదంతో ఆ సంఖ్య 27కు చేరుకొనుంది. అయితే ఇదే అదునుగా మరో నాలుగురు ఐదుగురు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిస్తే.. కూటమి బలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే అధిగమిస్తుంది. ఆ మరు క్షణం మాత్రం శాసనమండలి కూటమి వశం అవుతుంది.
* ఉద్వాసన తప్పదా?
శాసనమండలి చైర్మన్గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోసేన్ రాజు ఉన్నారు. ఆయన పదవీకాలం 2028 చివరి వరకు ఉంది. ఆపై శాసనమండలి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఆ బలం చెక్కుచెదరకూడదని వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించలేదు మోసేన్ రాజు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే కూటమికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టేందుకు శాసనమండలి నివేదికగా చేసుకుంది. అందుకే శాసనమండలి పై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి. ఈ ఐదుగురు రాజీనామాను అధికారికంగా ఆమోదించిన మరుక్షణం మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసే అవకాశం ఉంది. వారి రాజీనామాలను సైతం ఆమోదిస్తే శాసనమండలిని చేజిక్కించుకోనుంది తెలుగుదేశం కూటమి. అయితే మున్ముందు రాజకీయ పరిణామాలు మరింత ముదిరే అవకాశాలు మాత్రం ఉన్నాయి.